కోలీవుడ్ స్టార్ హీరో
విజయ్ నటించిన ‘బిగిల్’ ఈ నెల 25 న రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ మూవీ విజిల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘తేరి’, ‘మెర్సిల్’ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ మూవీలో విడుదలకు ముందు ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. ట్రైలర్ యూట్యూబ్ లో ఈ సినిమాలో
విజయ్ ద్విపాత్రాభియనంచేస్తున్నారు.
గత కొంత కాలంగా కోలీవుడ్ లో
విజయ్ నటిస్తున్న సినిమాలు రిలీజ్ కి ముందు ఎన్నో కాంట్రవర్సీలకు గురి అవుతున్నాయి. మెర్సిల్ మూవీ వైద్యలు, జీఎస్టీపై కాంట్రవర్సీ ఉందని కొన్ని రోజులు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఇక సర్కార్ మూవీలో ప్రభుత్వం అమలు చేసే పథకాలపై నెగిటీవ్ గా చూపించారని పెద్ద గొడవలే జరిగాయి. ఆ మద్య ‘బిగిల్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడు ఓ వివాదం తెరపైకి వచ్చింది. మాంసం వ్యాపారం చేసుకునే వారు కత్తిని గౌరవంగా భావిస్తామని.. తమ మనోభావాలను
విజయ్ కించపరుస్తున్నాడని గొడవ చేశారు.
ఈ నేపథ్యంలో విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తాజాగా తెరపైకి కొత్త వివాదం హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాపై ఓ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ కంప్లైంట్ చేశాడు. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించే డైరెక్టర్ నంది చిన్ని
కుమార్ తన సినిమా `స్లమ్ సాకర్’ ఆధారంగా చేసుకుని `విజిల్ మూవి డైరెక్టర్ అట్లీ తెరకెక్కించారని అంటున్నారు. తెలంగాణ సినిమా రచయితల సంఘాన్ని కోరారు. ఈ మేరకు పిటిషన్ను కూడా వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సినీ రచయితల సంఘం రెండు కథలను పరిశీలించి వివాదంపై స్పందించనుంది.