మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా గత కొన్ని రోజులుగా వివాదాలు సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ... ప్రస్తుతం ఆ వివాదాలు  మరోసారి రాజుకున్నాయి . మా అధ్యక్షుడు నరేష్ కి తెలియకుండానే మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న... జీవిత రాజశేఖర్  మీటింగ్ నిర్వహించారు. కాగా ప్రస్తుతం ఈ మీటింగ్ మా అసోసియేషన్ లో సంచలనంగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ లేకుండానే బాడీ మీటింగ్ నిర్వహించడం ఏమిటని అందరు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి మా అధ్యక్షుడు నరేష్ తప్ప మిగతా సభ్యులు అందరూ హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో మా అధ్యక్షుడు నరేష్ వర్గం జీవిత రాజశేఖర్ వర్గం పై మాటల దాడి చేశారు. ఈ సందర్భంగా సమావేశం మొత్తం రసాభాసగా మారింది. 

 

 

 

 

 అయితే మా అధ్యక్షుడు నరేష్ తరఫు న్యాయవాది అధ్యక్షుడు నరేష్ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే మా అసోసియేషన్ లో ఈసీ మెంబర్ గా ఉన్న ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ , కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి మా అసోసియేషన్ లో ఉన్న వివాదాలపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అసోసియేషన్ కి అధ్యక్షులు మారుతున్నప్పటికీ కూడా... మా అసోసియేషన్ తీరు మాత్రం మారడం లేదని 30 ఇయర్స్ పృథ్వి విమర్శించారు. మా అధ్యక్షుడు నరేష్  జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ ఇరువర్గాలను ఏర్పాటు చేసుకున్నారని అన్నారు . మా అసోసియేషన్ జనరల్ మీటింగ్ అని చెబుతున్న జనరల్ సెక్రటరీ జీవితారాజశేఖర్ వర్గం... బాడీ మీటింగ్ అంటూ బ్యానర్ లు పెట్టారని అన్నారు. 

 

 

 

 

ఇక మా అసోసియేషన్ లో ఉన్న మెంబర్లు  కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని  పృథ్వి విమర్శించారు. అయితే మా అసోసియేషన్ ఈసీ మెంబర్ గా గెలిచినందుకు సంతోషపడాలో  లేక ఈ వివాదాలన్నింటినీ చూసి బాధ పడాలో అర్థం కావట్లేదని పృద్వి వ్యాఖ్యానించారు. మా అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ తీరును చూసి ప్రముఖ రచయిత నటుడు పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకున్న వెళ్లిపోయారని పృథ్వి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏదేమైనా మా అసోసియేషన్ వివాదం రోజు రోజుకు రగిలిపోతుంది తప్ప... ఓ. కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: