తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 షో పై సంచలన కామెంట్ చేశారు సీజన్ 1 టైటిల్ విన్నర్ శివ బాలాజీ. బిగ్ బాస్ సీజన్ 3 షో కి రాను రాను క్రేజ్ తగ్గిపోతుందని బోరింగ్ గా మారుతుందని బయట కొంతమంది సోషల్ మీడియాలో నెటిజన్లు షో చివరి దశకు చేరుకున్న క్రమంలో గత రెండు సీజన్ల కు మించి పెద్దగా ఈ సీజన్ 3 ఏమి అలరించలేదని ఇటీవల కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ త్రీ లో ఇచ్చిన టాస్క్ లు...మరియు ఇతర కార్యక్రమాలు పెద్దగా చూసే ప్రేక్షకులను అలరించలేకపోయింది అంటూ సీజన్ త్రీ లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదని గత రెండు సీజన్లలో ఉన్న ఎంటర్టైన్మెంట్ సీజన్ త్రీ లో తగ్గిపోయిందనే కామెంట్లు ఎక్కువగా వినబడుతున్నాయి.


ఇటువంటి నేపథ్యంలో బిగ్బాస్ సీజన్ 1 టైటిల్ విన్నర్ శివ బాలాజీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ లో ఉండాల్సిన మజా సీజన్ 3లో లేదు. అందుకే ఈ షో చూడడం లేదు అని శివ బాలాజీ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. ఆరంభంలో బిగ్ బాస్ 3 కొన్ని ఎపిసోడ్స్ చూశా. నాకు కనెక్ట్ కాలేదు.


సినీ షూటింగ్స్ తో ఇప్పుడు షో పూర్తిగా చూడడం మానేశా అని శివబాలాజీ వ్యాఖ్యానించాడు. కంటెస్టెంట్స్ ముందుగానే బయట సోషల్ మీడియా టీమ్స్ ని ఏర్పాటు చేసుకుని పక్కాగా ప్లాన్ తో హౌస్ లోకి అడుగుపెట్టారు. టాస్క్ లలో కూడా వారి లెక్కల ప్రకారమే పెర్ఫామ్ చేస్తున్నారు. అందువల్లే షోలో ఎంటర్టైన్మెంట్ తగ్గింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే టాస్క్ లు కూడా అభిన్నంగా ఏమీ లేవు. దీనితో చూసిన సినిమానే రెండవసారి చూస్తున్న ప్రేక్షకుల్లో కలుగుతోంది….అన్న అభిప్రాయం బయట కూడా ఎక్కువ వినబడుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: