టాలీవుడ్ లో ప్రస్తుతం అడల్ట్ కంటెంట్  కంపు కొడుతుంది. ఎక్కువుగా బెంగాలీ, హిందీ సినిమాల్లో కనిపించే  అసహ్యమైన ఎక్స్  సీన్స్.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా విచ్చలవిడిగా వచ్చి పడుతున్నాయి.  డిజిటల్ యుగంలో ఈ తరహా సీన్స్ కు ఆదరణ పెరిగాక, కమర్షియల్ దర్శకులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.  ఏ  సినిమా తీసినా, ఎలాంటి ఎమోషన్ పెట్టినా పెట్టకపోయినా.. ఒక లిపి కిస్ పెట్టేస్తున్నారు.  తమ బుర్రలకు పదును పెడుతూ ఈ లిప్ కిస్సెస్ లో  క్రియేటివిటీని చూపిస్తూ..  ఫ్యామిలీ  ప్రేక్షకులకు  సినిమా పైనే ఏవగింపు కలిగిస్తున్నారు.  వాస్తవానికి  తెలుగు సినిమాల్లో విపరీతమైన బరితెగించిన  ముద్దు సన్నివేశాలను..  మన ప్రేక్షకులు తొందరగా  జీర్ణించుకోలేరు. అందుకే ఒకప్పుడు మూతి మూతి రాసుకున్నే ముద్దు సీన్స్ ను కూడా  సెన్సార్ సభ్యులు కట్ చేసేవారు.  కానీ తరం మారుతున్న కొద్దీ ఇవి సర్వసాధారణం అయ్యాయి. ముఖ్యంగా గత పది  సంవత్సరాలుగా వస్తున్న సినిమాల్లో  ఈ హద్దులు మీరిన ముద్దుల  సీన్స్  లేకపోతేనే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంది.   

ఏది ఏమైన  మూవీ మేకర్స్  తమ  సినిమాని  క్యాష్ చేసుకోవాలనే ఆత్రుతలో  అవసరం ఉన్నా లేకపోయినా  మూడు ముద్దు సీన్స్..   ఆరు రొమాంటిక్ సాంగ్స్ తో   ప్రేక్షకుల ఆకట్టుకోవాలని చూస్తున్నారు.  ఇలాంటి జోనర్ లో వచ్చిన  సినిమాల్లో  'అర్జున్ రెడ్డి', 'ఆర్ ఎక్స్ 100' లాంటి కొన్నిటిని  కంటెంట్ పరంగా ప్రేక్షకులు ఆదరించడంతో.. కిస్ లు  వల్లే  ఆ చిత్రాలు  హిట్ అయ్యాయని.. మొత్తానికి 'ఎక్స్' డైరెక్టర్స్  'ఉమెన్స్ నాట్ ఎలౌడ్', ‘ఏడు చేపల కథ’,   'చీకట్లో చితక్కొట్టుడు', 4 లెటర్స్,  అప్పట్లో  వచ్చిన ‘24 కిస్సెస్’, రధం, నటన, నాటకం లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నారు.  అయితే  ఏ కొత్త హీరోహీరోయిన్లో.. లేక వీటితోనే స్టార్ డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఇలాంటి ముద్దు సన్నివేశాల్లో నటిస్తే.. సర్లే అని చూసి చూడనట్లు వదిలేయొచ్చు.  కానీ ఏకంగా  కింగ్ నాగార్జున, వెంకటేష్  లాంటి సీనియర్ హీరోలు కూడా ఇలాంటి కిస్ ల సీన్స్ చేస్తుంటే ఏమనుకోవాలి ?  ఇలాంటి సీనియర్  హీరోలు ఇలాంటి కమర్షియల్  సినిమాలు కాకుండా  కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీస్తే..  టాలీవుడ్ కి కూడా మేలు జరుగుతుంది. మరి అప్ కమింగ్ సినిమాలకైనా ఈ హీరోలు  ఆ దిశగా ఆలోచించాలని కోరుకుందాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: