ఈ వారం నామినేషన్ ప్రక్రియ విభిన్నంగా జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచిన వాళ్ళు డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన మిగతా సభ్యులు నామినేషన్ లోకి వెళ్తారు.  అయితే ఈ టాస్క్ మొదటి రౌండ్ లో శివజ్యోతితో తలపడి ఆలీ గెలిచాడు. దాంతో అతని బ్యాటరీ ఫిల్ చేసుకునే అవకాశం వచ్చింది. మూడో రౌండ్ లో శ్రీముఖితో తలపడి బాబా భాస్కర్ గెలిచాడు.


అయితే వీరిద్దరూ నాలుగో రౌడ్ లో పోటీ పడ్డారు. అయితే ఈ నాలుగో రౌండ్ లో ఆలీ గెలిస్తే అతని బ్యాటరీ ఫిల్ అవుతుంది. దానివల్ల అతను ఎవరికి అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయి టికేట్ టు ఫినాలే గెలుచుకుంటాడు. ఇది తెలుసుకున్న ఆలీ బాబా భాస్కర్ తో తలపడే టాస్క్ లో ఎలాగైనా గెలవాలని అనుకుంటాడు.అదీ గాక రాహుల్ కూడా నువ్వెలాగైనా గెలవాలి. నీ బలం మొత్తం చూపించు అని చెప్తాడు.


అయితే వీటన్నింటిని మనసులో పెట్టుకున్న ఆలీ బాబా భాస్కర్ తో ఆడే టాస్క్ లో చాలా అగ్ర్రెసివ్ కి లోనయ్యాడు.  ఎలాగైనా గెలవాలనే ప్రయత్నంలో బాబా భాస్కర్ ని తలతో గుద్దడం హాట్ టాపిక్ గా మారింది.  హింస చేయకూడదు అనే బేసిక్ నియమాన్ని ఆలీ మర్చిపోయాడు. గెలవాలనే పట్టుదలతో ఆడితే ఫర్వాలేదు. కానీ ఎదుటివారికి హాని జరిగేలా ఆడటం కరెక్ట్ కాదు. ప్రతీ దానికి ఒక పరిధి ఉంటుంది.


ఆ పరిధి దాటి ప్రవర్తించడం సరికాదు. ఆలీ, బాబా భాస్కర్ ని తలతో గుద్ది ఆ పరిధిని దాటేశాడు. ఈ విపరీత పరిణామం వల్ల ఆలీ గెలవచ్చేమో కానీ, ప్రేక్షకుల మనసు గెలుచుకోలేడని భావిస్తున్నారు.ఆలీ చేసిన పని వల్ల ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు. ఈ ప్రభావం ఫైనల్ మీద బాగా పడుతుందని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: