పవర్ ఫుల్  నటనకి పెట్టింది పేరు రానా. ఎలాంటి పాత్ర ఇచ్చిన ఆ పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించగల సత్తా ఆయన  సొంతం. అయితే తెలుగు లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా... ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పవర్ ఫుల్  పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు . ఒక్క తెలుగులోనే కాదు తమిళ హిందీ భాషల్లో సైతం ఎన్నో విభిన్నమైన పాత్రల్లో  నటిస్తున్నాడు రానా. ప్రతి పాత్రలో నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు రానా .అందుకే ఆయన నటనలో ఎప్పుడు కొత్తదనం కనిపిస్తుంది.  కళ్ళతోనే హావభావాలను పండించగల సత్తా రానా  సొంతం. అయితే గత కొంత కాలంగా రానా  కిడ్ని వ్యాధితో బాధపడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. 

 

 

 

 అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే  రానా కూడా అంతలా కనిపించకపోవడంతో ఆ వార్తలు అన్ని  నిజమని నమ్మారు అభిమానులు.  ఇక తాజాగా... సురేష్ బాబు రానా  ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా  రానా తాజాగా హిందీలో  హౌస్ ఫుల్ 4...  చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 25న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 600 సంవత్సరాల పూర్వానికి ప్రస్తుతానికి మధ్య పునర్జన్మల  నేపథ్యంలో సాగే కామెడీ సినిమా ఇది.. 

 

 

 

 

 కాగా  ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అక్షయ్ కుమార్,  రితేష్ దేశ్ముఖ్,  పూజ హిగ్డే,  కృతి సనన్ లు నటిస్తున్నారు ఇక . రానా కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు . ప్రస్తుతం రానా లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. రానా గెటప్  చూస్తే ఈ సినిమాలో ఒక కక్షుద్ర  మాంత్రికుడిగా రానా కనిపించనున్నాడని విషయం  తెలుస్తుంది తెలుస్తుంది. భయంకరమైన రూపంతో చేతిలో మంత్ర దండం పట్టుకుని కనిపిస్తున్నారు రానా . కాగా ఈ పాత్ర రానా కెరీర్లోనే ప్రత్యేకమైంది గా నిలుస్తుందని ఆయన భావిస్తున్నారు. అయితే ఈ నెల 25న విడుదల కానున్న  హౌస్ ఫుల్ 4  చిత్రం కోసం చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: