తెలుగు ప్రేక్షకులను చిన్నతనంలోనే 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ తో మెప్పించిన అవికా గౌర్ 'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రెండు మూడు సినిమాలతో ఆకట్టుకున్న అవికా గౌర్ ఆ తర్వాత సక్సెస్ లు అందుకోలేక పోయింది. దానికి తోడు బాగా లావు అవ్వడంతో విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో కొన్ని కుటుంబ వ్యవహారలతోను ఇబ్బందులు ఎదుర్కొంది. అన్ని సద్దుమణిగాక లావు తగ్గి  ఇటీవల 'రాజు గారి గది 3' సినిమాతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి నుంచి ఎలాంటి పాత్రల్లో అయినా.. ఎలా అయినా నటించేందుకు సిద్దం అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే గ్లామర్ పాత్రలు పోషించడానికి రెడి అని ఇండికేషన్ ఇచ్చింది.

ఇక రాజు గారి గది 3 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన అవికా గౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది. తను ఒక సినిమా ఫంక్షన్ లో స్కర్ట్ వేసుకుని డాన్స్ వేసినప్పుడు చాలా మంది ట్రోల్స్ చేశారు. అంతేకాదు నన్ను కాస్త గ్లామర్ గా చూడటంతో చాలా మంది వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు కూడా. అదే సమయంలో నేను బాగా లావుగా ఉన్నానంటూ తీవ్రంగా ట్రోల్స్ చేశారు. అయితే అలా వచ్చిన ట్రోల్స్ ను నేను పాజిటివ్ గా తీసుకున్నాను. లావు అవ్వడం అనేది నా అనారోగ్య సమస్య కాదు. ఎక్కువ తినడం మరియు బద్దకం కారణంగా వ్యాయామం చేయకపోవడం. 

నామీద వచ్చిన ట్రోల్స్ తో నేను బద్దకం వదిలేశాను. నేను రాజు గారి గది 3 సినిమాలో 12 కేజీల బరువు తగ్గి నటించాను. ఈ సినిమాతో మంచి స్పందన వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేనిలా మారడానికి నా మీద వచ్చిన ట్రోల్స్ బాగా హెల్ప్ అయ్యాయని చెప్పింది. సన్నబడ్డ అవికా గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సై అంటోంది. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలు ఇచ్చినా చేసేందుకు సిద్దం అంటూ అవికా దర్శక నిర్మాతలకు ఇన్‌డైరెక్ట్ గా సంకేతాలు పంపింది. సన్నబడటంతో నామీద నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు నేను ఎలాంటి డ్రస్ లను అయినా వేసుకోవచ్చు అంటూ ఎక్స్ పోజింగ్ చేస్తానంటూ హింట్ ఇచ్చింది. మరి ఈమెకు తెలుగులో మళ్లీ బిజీ అయ్యేంతగా ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: