ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస మూవీల‌తో దూసుకుపోతున్న స్టార్ హీరో అజిత్‌. కోళీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌రుస మూవీల‌తో బాక్సాపీస్‌కు బ్లాక్‌బ‌స్టర్ మూవీల‌ను అందిస్తున్న ఏకైక హీరో అజిత్ అని యావ‌త్ కోళీవుడ్ ఇండ‌స్ట్రీ అంటుంది. అజిత్‌తో పాటు పోటీ ప‌డే మ‌రో హీరో విజ‌య్‌. గ‌త మూడు సంవ‌త్సరాలుగా చూసుకుంటే విజ‌య్ బాక్సాపీస్ మార్కెట్ కంటే అజిత్ బాక్సాపీస్ మార్కెట్ కోళీవుడ్‌లో ఎక్కువ‌ని అక్కడి సినిమా అభిమానులు సైతం చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం అజిత్ త‌న న్యూ గెట‌ప్‌తో అభిమానులని స‌ర్‌ప్రైజ్ చేశాడు. అదే గుండు గెట‌ప్‌. త‌న అప్‌కమింగ్ ఫిల్మ్ వీరం మూవీకు సంబంధించిన పూర్తి షూటింగ్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తికావ‌డంతో కావ‌డంతో అజిత్ గుండు చేయించుకున్నాడు. అజిత‌క్ష‌ పాటు ఈ మూవీ డైరెక్టర్ కూడ గుండు చేయించుకున్నాడు. వీరం మూవీ స‌క్సెస్ ఫుల్‌గా కంప్లీట్ అయితే దేవుడికి త‌ల‌నీలాలు ఇస్తామ‌ని వీరం మూవీ హీరో,ద‌ర్శకుడు మొక్కుకున్నారంట‌. ఇంకేముంది మూవీ స‌క్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కావ‌డంతో, వీరిద్దరూ గుండు గెట‌ప్‌తో ద‌ర్శనమిచ్చారు. కోళీవుడ్‌లో ఈ విధంగా మూవీ కంప్లీట్ త‌రువాత గుండు గెట‌ప్‌తో ద‌ర్శన‌మివ్వటం చాలా కామ‌న్‌గా ఉంటుంది. వారిలో ప్రస్తుతం ఐ చిత్రం తీస్తున్న డైరెక్టర్ శంక‌ర్ కూడ ఉన్నాడు. వీరం మూవీకు సంక్రాంతి పండుగ స్పెష‌ల్‌గా థియోట‌ర్స్‌లోకి వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: