భారీ స్టార్ కాస్టింగ్ హై ఎక్స్ పెక్టేషన్స్ తో సంబందం లేకుండా చాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.పెద్ద సినిమాలతో పాటు రిలీజైన చిన్ని సినిమాలు కూడా ఓ సెన్సేషన్ ను క్రియోట్ చేస్తున్నాయి. అ ట్రెండ్ ను కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా కొన్ని చిన్ని సినిమాలు వెండితెరపై అలరించడానికి రడీ అవుతున్నాయి.ఆ డిటేల్స్ ఇప్పుడు మీకోసం. గత సంవత్సరం మారుతి మార్క్ తొ చిన్న బడ్జెట్ లో రూపొంది భారీ హిట్ ను స్వంతం చేసుకున్న సినిమా ప్రేమకథాచిత్రం. ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ ఇప్పుడు మారుతి టాకీస్ నుండి వస్తున్న మూవీ ‘లవ్ యు బంగారమ్’. ‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్, సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ ప్రధాన పాత్రధారులుగా నటించారు.. గోవి దర్శకునిగా పరిచయమైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది..మారుతి దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా కొత్తజంట. గౌరవం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు వారి హీరో అల్లు శిరీష్, రెజీనా హీరో హీరోయిన్లుగా సరి కొత్తప్రేమ కథాంశం తో మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తేన్నారు. ఈ ఇయర్ రాబోతున్న చిన్న సినిమా ఉందిలే మంచి కాలం ముందుముందునా ..‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సుధాకర్ హీరో గా అరుణ్‌ దాస్యం దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఉందిలే మంచికాలం ముందుముందున’. ఈ చిత్రంలో సుదాకర్ కు జోడిగా అవంతిక మోహన్ నటిస్తుంది. ఇదే బాటలో గ్రీన్ సిగ్నల్ అనే సినిమాతో వస్తున్నారు డేఇరక్టర్ సిమన్ హేరీ... యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనింగ్ గా వస్తున్న ఈ సినిమా మారుతి ఫిల్మ్ ఫాక్టరీ నుండి రిలీజ్ కి రెడీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: