హాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో దాదాపు వండ‌ర్ జ‌రిగింద‌నే చెప్పవ‌చ్చు. ఎందుకంటే హాలీవుడ్‌లో ఎఫైర్లకు అతీతంగా ఓ క్యూట్ ప్రపోజ్ తెర‌పైకి వ‌చ్చింది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ 'జెన్నీఫ‌ర్ లారెన్స్‌'ను, స్టార్ యాక్టర్ 'నికోల‌స్ హోల్ట్' ప్రపోజ్ చేశాడు. త‌ను ప్రపోజ్ చేసిన విధానం తెలుసుకున్న హాలీవుడ్‌, దాదాపు అవాక్కయ్యింది. మేట‌ర్ ఏంటంటే 'జెన్నీఫ‌ర్ లారెన్స్‌'ను 'నికోల‌స్ హాల్ట్' మ్యారెజ్ చేసుకోబోతున్నాడ‌ని హాలీవుడ్‌లో న్యూస్ జోరుగా విన‌ప‌డుతుంది. ఇంగ్లాండ్‌లోని లీడింగ్ టాబ్లాయిడ్ ప‌బ్లిష్ చేసిన క‌థ‌నాన్ని ఎపిహెరాల్డ్‌.కం మీకు అందిస్తుంది. 23 సంవ‌త్సరాలు ఉన్న జెన్నీఫ‌ర్ లారెన్స్‌కు హాలీవుడ్‌లో విప‌రీత‌మైన క్రేజ్‌. జెన్నీఫ‌ర్ లారెన్స్‌తో డేటింగ్ చేయటానికి హాలీవుడ్ టాప్ యాక్టెర్స్ అంతా క్యూలో నిల‌బ‌డ‌తారు. అలాగే ప్రొడ్యూజ‌ర్స్‌, డైరెక్టర్స్ అయితే జెన్నీఫ‌ర్ లారెన్స్‌కు చిన్న పాటి పాత్ర ఇచ్చి అయినా, త‌న‌ను డేట్‌కు ఒప్పించాల‌ని తెగ ప్రయ‌త్నాలు చేస్తుంటారు. అయితే డేటింగ్ క‌ల్చర్‌కు జెన్నీఫ‌ర్ లారెన్స్‌ దూరంగానే ఉంటుంది. త‌ను మూవీ షూటింగ్ పూర్తైన త‌రువాత ఎక్కువుగా ఫ్యామిలీతోనే స‌మ‌యాన్ని గ‌డుపుతుంది. అందుకే మోడ‌ల్ కం స్టార్ యాక్టెర్ 'నికోల‌స్ హోల్ట్‌', 'జెన్నీఫ‌ర్ లారెన్స్‌ ను డేటింగ్‌తో కాకుండా పెళ్ళితోనే మేట‌ర్‌ను ఫినిష్ చేయాల‌ని నిర్ణయించుకున్నాడు. క్రిస్‌మ‌స్ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా జ‌న్నీఫ‌ర్ లారెన్స్ త‌న ఫ్యామిలీతో ఇంట్లోనే గ‌డిపింది. ఆ రోజు నికోల‌స్, జెన్నీఫ‌ర్ లారెన్స్ ఇంటికి వెళ్ళి, ప్యామిలీ నెంబ‌ర్స్ అందూ ఉండ‌గానే జెన్నీఫ‌ర్ లారెన్స్‌కు ప్రపోజ్ చేశాడు. త‌న గురించి పొగుడుతూ, భ‌విష్యత్‌లో త‌న‌ని ఏ విధంగా చూసుకుంటానో వంటి వివ‌రాల‌ను ప్యామిలికి వివ‌రించాడు. మొత్తానికి ఓ అంద‌మైన ఏంజ‌ల్‌ని సొంతం చేసుకోవాలంటే ఈ మాత్రం నిజాయితి ఉండాల్సిందే అని కొంద‌రు అంటున్నా, ఈ త‌ర‌హా ప‌ద్దతి హాలీవుడ్‌కు స‌రికాద‌ని మ‌రికొంద‌రు బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: