2013వ సంవత్సరం అంతా నిరాశజనకంగా గడిపిన తమన్న, ఒక్కసారిగా 2014లో తన లక్ మరో సారి తిరిగింది. ఏకంగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ, తమన్న ఫుల్ బిజి షెడ్యూల్స్ ను గడుపుతుంది. దీంతో తమన్న అంటే ఇప్పుడు ఎవరూ టచ్ చేయనంతగా ఎదుగుతుంది. టాలీవుడ్ లో ఓ రెండు మూవీలు, కోలీవుడ్ లో రెండు మూవీలు, బాలీవుడ్ లో మరో ఆఫర్ ఇలా తమన్న ఫిల్మ్ షెడ్యూల్ అంతా ఫుల్ బిజిగా మారింది. అయితే తమన్న టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంటే, ఓ నిర్మాత తనకి ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. కచ్ఛితంగా తన మూవీలో ఐటెం సాంగ్ చేయాల్సిందే అంటూ తమన్నకు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కాల్ వచ్చింది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. తమన్న కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉదయ్ నిధి స్టాలిన్ మూవీలో ఓ స్పెషల్ రోల్ చేస్తుంది. అయితే ఈ మూవీలో ఆ పాత్రను చేసేందుకు ముందుగా, తనకు ఓ మేనజర్ ఫోన్ చేసి, కోలీవుడ్ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ చేయాలి, అలా చేయకుంటే నీకు భవిష్యత్ ఉండదంటూ వార్నింగ్ ఇచ్చాడట. అయితే ఆ ప్రాజెక్ట్ డిటైల్స్ తెలుసుకున్న తమన్న, ఆ మూవీ హీరోతో మాట్లాడింది. ఆ మూవీకు ఉదయ్ నిధి స్టాలిన్ హీరో కావటంతో, స్టాలిన్ తో తమన్నకు మంచి పరిచయాలు ఉన్నాయంట. తనకు ఈ విధంగా బెధిరింపులు వచ్చాయి, అవి చేయించింది నీవేనా అంటూ హీరో వద్ద తమన్న కూపీలు లాగింది. అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదు. నీవు చెబుతున్న మేనేజర్ కూడ నాకు తెలియదు అంటూ ఉదయ్ నిధి స్టాలిన్ సమాధానం ఇవ్వటంతో, తమన్నకు తనను బెధిరించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: