మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు తన నెక్స్ట్ సినిమా ఎలాంటిది తీస్తాడా అని ఎదురుచూసారు కాని ఆ డైరక్టర్ మర్యాద రామన్న లాంటి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీసి అందరని ఆశ్చర్య పరిచాడు. తీసిన ప్రతి సినిమాను ఓ యజ్ఞం లా కష్టపడి చేసే డైరక్టర్ యస్.యస్.రాజమౌళి. ఓ కమెడియన్ ని పెట్టి సినిమా తీసి హిట్ కొట్టాడు డైరక్టర్ రాజమౌళి. తను చేసే ప్రతి పనిలో శ్రమతో చెమటోడ్చి పనిచేస్తాడు ఈ డైరక్టర్ అందుకే ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా ఆయన ఖాతలో పడలేదు. ఇక ఈయన తీసిన ఈగ సినిమా అయితే అద్భుతం కళ్ళకు కట్టినట్లు అనిపిస్తుంది. విజువల్ వండర్ గా ఆ సినిమా తీసి దక్షిణ భారత సినిమా ఖ్యాతిని పెంచింది. తాజాగా ఆయన తీసిన మర్యాద రామన్న సినిమాను తమిళ్ లో రీమేక్ చేశారు కోళీవుడ్ ప్రొడ్యూసర్స్. ఆ సినిమాలో కోళీవుడ్ హాట్ ఫేవరేట్ కమెడియన్ సంతానం ని హీరోగా పెట్టారట. సూపర్ స్టార్ రజని కాంత్ కొచ్చాడియన్ కొన్ని కారణాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ కావడం చేత ఈ సినిమాను రిలీజ్ చేశారట ప్రొడ్యూసర్స్. రిలీజ్ అయిన మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుందట ఈ తమిళ్ మర్యాద రామన్న. సో మన రాజమౌళి ప్రతిభా పటిమ అక్కడ కూడా హిట్ సాధినట్లే. అయినా ఆయన తీసిన ఈగ సినిమా తమిళ్ లో కూడా సూపర్ హిట్ సాధించింది. సో ఇది రాజమౌళికి రెండో హిట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి సినిమాని చెక్కెపనిలో ఉన్నాడు. సో ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి మరోసారి రాజమౌళి స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్. మర్యాద రామన్న అక్కడ హిట్ అవ్వడం పై మీ కామెంట్ ..? 

మరింత సమాచారం తెలుసుకోండి: