బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ న్యూస్ హాట్ హాట్ గా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కండల వీరుడు సల్మాన్ సరసన నటించే ఛాన్స్ కంగనా రనౌట్ కి దక్కిందని బాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.

బజ్ రంగీ బాయీజాన్ తరువాత సల్మాన్ నటించబోయే సుల్తాన్ సినిమాలో కంగనాకు హీరోయిన్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. సల్మాన్ సైతం కంగనాతో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే, కండల వీరుడితే నటించటానికి కంగనానే ఆసక్తి చూపించిందట.

కెరీర్ లో చాలా సార్లు షర్ట్ లెస్ గా నటించి అభిమానులను, ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిన కండలవీరుడు మరోసారి అలాంటి సీన్ ను రిపీట్ చేయబోతున్నాడు.

ఇప్పటికీ ఫిజిక్ విషయంలో ఎంతగానో కేర్ తీసుకునే సల్మాన్, బజ్ రంగీ బాయిజాన్ లోనూ షర్ట్ లెస్ యాక్షన్ సీన్స్ కు ఓకే చెప్పాడు. మొత్తంగా కంగనా కావాలనే ఈ కాంబినేషన్ ని సెట్ చేసుకోవడంతో సల్మాన్, కంగనా రనౌట్ మధ్య ఎటువంటి కెమిస్ట్రీ జరగబోతుందో అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: