టైమ్స్...ప్రపంచంలో అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తుల వివరాలని టైమ్స్ తన మ్యాగజైన్ లో ప్రచురిస్తూ ఉంటుంది..ప్రతీ ఏటా ఈ వివరాలని వెల్లడిస్తూ ఉంటారు..అయితే వరుసగా 2015 నుంచీ 2017 వరకూ జాబితాలో భారత ప్రధాని మోడీ పేరు వచ్చింది..అయితే ఈ సంవత్సరానికి గాను మరో మారు భారత ప్రధాని మోడీ పేరు పరిశీలనలో ఉంది అంతేకాదు భారత సంతతి వ్యక్తి సత్య నాదెళ్ళ పేరు కూడా ఈ సారి పరిశీలనలోకి వచ్చిందని తెలిపారు..

 Image result for times magazine modi satya nadella 2018

 ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలురైన 100మంది ప్రముఖ రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, కళాకారులు, సాంకేతిక నిపుణులతో కూడిన జాబితాను ప్రతిఏటా టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసే విషయం తెలిసిందే..వచ్చే నెలలో ఈ జాబితాను విడుదల చేయనున్నారు. అయితే తాజా జాబితాలో అమెరికా అధ్యక్షులు ట్రంప్‌, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌, మైక్రోసాఫ్ట్‌ సిఈఓ సత్యనాదెళ్ల ఉన్నారు..

 Related image

వీరితో పాటే  ఉత్తరకొరియా అధ్యక్షులు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ఇవాంకా ట్రంప్‌, ఫేస్‌బుక్‌ సిఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తదితరులున్నారు. బ్రిటన్‌ రాజకుటుంబీకులూ...అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా కూడా ఉన్నారు. ఆన్‌లైన్‌ ఓటింగు పద్ధతిలో టైమ్‌ మ్యాగజైన్‌ ఎడిటర్లు వీరిని ఎంపిక చేయనున్నారు. ఇదే జాబితాలో పోప్‌ ఫ్రాన్సిస్‌, మాక్రాన్‌ కూడా  ఉన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: