ఈ మధ్యకాలంలో విదేశీ యువతీ యువకులతో భారతీయులు పెళ్లిళ్లు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. విదేశాల నుంచి వచ్చేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా హిందూ సంప్రదాయానికి ఎంతో ఇష్టపడుతున్నారు. విదేశాల నుండి ఇక్కడికి వచ్చి మరి హిందూ సంప్రదాయంలో బట్టలు ధరించి, ఆచారాలు ఫాలో అయ్యి మరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 

                      

ఎందుకు అలా అంటే ఐ లవ్ ఇండియా కల్చర్ అంటూ సమాధానాలు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే స్పెయిన్‌ యువతి, అనంతపురం జిల్లా తాడిపత్రి యువకుడు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయంలో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రికి చెందిన విజయకుమార్‌ వృత్తిరీత్యా వైద్యుడు. బత్తలపల్లిలోని ఆర్టీటీ ఆస్పుత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. 

             

అయితే స్పెయిన్‌ దేశానికి చెందిన కార్లా అనే యువతి కూడా వృత్తిరీత్యా దంత వైద్య నిపుణురాలు. స్పెయిన్ యువతీ కూడా ఆర్డీటీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఇరువురూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి వారి పెద్దలతో చర్చించారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో శనివారం తాడిపత్రి పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. 

                           

కుటుంబ సభ్యులు, బంధువులు వధూవరులను ఆశీర్వదించారు. కాగా వీరి వివాహానికి ఎంతోమంది విదేశీయులు హాజరయ్యి పెళ్లి వేడుకను ఘనంగా చేశారు. అంతే కాదు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కొందరు వారి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: