భారతదేశం ఇది వివిధ మతాలకు కులాలకు సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి ప్రజల కట్టుబాట్లు,  పద్ధతులు, కూడా సంప్రదాయ పద్దతిలో ఉంటాయి అలాగే  ప్రవాస భారతీయ ఆర్థికవేత్తకు నోబెల్‌ బహుమతి   ఆర్థికవేత్త అభిజిత్‌ వినాయక్‌ బెనర్జీ మరియు ఆయన భార్య ఎస్తేర్‌ డఫ్లోతోపాటు సహోద్యోగి మైఖేల్‌ క్రెమెర్ 2019 ఏడాదికిగాను ఆర్థిక శాస్త్ర నోబెల్‌ బహుమతిని అందుకున్నారు.

ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. అవార్డు  ప్రదానోత్సవానికి అభిజిత్‌ దంపతులు భారతీయత ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణ పట్టు పంచ, ఖాదీ వస్త్రాన్ని ధరించి  హాజరయ్యారు. ప్రపంచ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక విధానంలో  పరిశోధన చేసినందుకుగాను మరియు సేవలు చేరినందుకు గాను  వారికి నోబెల్‌ అవార్డు వరించింది. వారి పరిశోధన ఆర్థిక శాస్త్ర రంగాన్ని మళ్ళీ గాడిలోకి తెచ్చారని అయన వల్ల దేశాలలో ఆర్థిక మాంద్యం లాంటి అంశాలపైనా ముందుగానే గమనించి వివరించే ప్రతిభ  ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పేదరిక నిర్మూలనకు అయన  చేసిన కృషికి సేవ కు గాను మంగళవారం స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఆ దేశ రాజు కార్ల్‌- 16 గుస్తాఫ్‌ నుంచి అవార్డు అందుకొన్నారు. ఈ వేడుకలో భారత సంతతికి చెందిన అభిజిత్‌ బెనర్జీ  భారతీయ సంప్రదాయ వేషాధారణలో అందరినీ ఆకర్షించారు అలాగే  ఆయన భార్య ఎస్తేర్‌ డఫ్లో సైతం నీలి రంగు చీర ధరించి నోబెల్‌ను అందుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: