కరోనా ప్రపంచ దేశాలపై తన పంజా విసురుతోంది. ఇప్పటికే ఎన్నో దేశాలు కరోనా ధాటికి అతలాకుతలం అయ్యిపోయాయి. ఇప్పటి వరకూ అగ్ర రాజ్యంగా వెలుగొందిన అమెరికా కరోనా దెబ్బకి అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. ముందస్తు  హెచ్చరికలు లేకపోవడం వలనే అమెరికా ప్రజలకి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. దాంతో ట్రంప్ పై అమెరికా ప్రభుత్వం పై పీకల్లోతు కోపంలో ఉన్నారు. అయితే కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ చివరికి ప్రాణాలని సైతం వదిలిన భారత సంతతి డాక్టర్లకి అమెరికా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు..వారి గుండెల్లో నిజమైన హీరోలుగా నిలిచిపోయారు..వివరాలోకి వెళ్తే..

IHG

ఎన్నో ఏళ్ళ క్రితమే భారత్ నుంచీ అమెరికా వెళ్ళిన ఓ మహిళ అమెరికాలో డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి అత్యధికంగా ప్రభలిన న్యూయార్క్ నగరంలోనే ఆమె కూడా వైద్య సేవలు అందిస్తున్నారు..కరోనా బాధితులకి వైద్యం చేస్తున్న సమయంలో ఆమెకి కూడా కరోన సోకడంతో చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందారు. అప్పటికే ఆమె ఎంతో మంది కరోనా రోగులకి వైద్యం చేస్తూ పాజిటివ్ కేసులని నెగిటివ్ గా చేయడంలో సక్సెస్ అయ్యారని కానీ ఆమెకి కరోనా సోకి అందరికి దూరం అవుతుందని అనుకోలేదని ఆసుపత్రి వర్గాలు  అంటున్నాయి..

IHG

మరో ఇండియన్ అమెరికన్ డాక్టర్ కరోనా  రోగికి చికిత్స చేస్తున్న సమయంలోనే అతడు వైద్యుడిపై వాంతి చేసుకున్నాడని ఈ క్రమంలోనే కరోనా వైద్యుడికి కూడా సోకిందని..ఈ నేపధ్యంలోనే చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందారు. ఇదిలాఉంటే అమెరికాలో ఇండియన్ అమెరికన్ డాక్టర్లు చేస్తున్న సేవలని అమెరికన్లు కొనియాడుతున్నారు తమకి భారతీయ వైద్యులు ఎంతో గొప్ప వైద్యాని అందించారని అంటున్నారు. ఈ విషయంపై స్పందించిన అమెరికన్ అసోసియేష్ ఆఫ్ ఫిజీషియన్ ఇండియన్ ఆరిజన్ సెక్రటరీ కోల్లు రవి, భారతీయ వైద్యులు ఇక్కడ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. ఖచితమైన లెక్కలు లేకపోయినా భారతీయ వైద్యులు ఎంతో మంది కరోన బారిన పడ్డారని, మరెంతో మంది మృతి చెందారని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: