అమెరికాలో కరోనా దెబ్బకి ఆర్ధిక పరిస్థితి చేయి దాటిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది..దాంతో అధ్యక్షుడు ట్రంప్ కి ఏమి చేయాలో కూడా దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ట్రంప్ చేపడుతున్న చర్యలు తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలో ఉండే విదేశీయులపై , అమెరికా రావాలని కలలు గంటున్న టెకీలు వివిధ రకాల నిపుణులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. తాజాగా ట్రంప్ హెచ్ -1 బీ వీసా రద్దు చేయాలని అంటుకుంటున్నట్టుగా వచ్చిన వార్తలు వివిధ దేశాల ఎన్నారైలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి..

 

అమెరికా ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం ప్రకారం. అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ హెచ్ -1 బీ సహా పలు వర్క్ వీసాలని రద్దు చేయనున్నారని తెలిపింది. అక్టోబర్ 1 నుంచీ ఈ విధానం మొదలు కానుందని తెలిపింది. ఇదే విధానం గనుకా అమలులోకి వస్తే అమెరికాలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతున్న వారికి హెచ్-1 బీ లేదా ఇతరాత్రా వీసాలు వచ్చిన వారు ఒక వేళ అమెరికాలో లేకున్నా వారు కూడా అమెరికాలోకి మళ్ళీ వెళ్ళడానికి వీలు లేకుండా పోతోంది. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అమెరికాకి ఈ వీసాల ద్వారా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా చైనా భారత్ నుంచీ వెళ్ళే నిపుణులే ఎక్కువగా ఉంటారు. కానీ ట్రంప్ తాజా నిర్ణయంతో వారికి బ్రేక్ పడినట్టేనని అంటున్నారు నిపుణులు.

 

ఇదిలాఉంటే ఈ వీసాతో ఎంతో కాలంగా అమెరికాలో ఉంటున్న వారు రెన్యువల్ చేసుకోక పొతే వారు కూడా అమెరికా నుంచీ సొంత దేశాలకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాదు కరోనా భయంతో అమెరికాలో ఈ వీసాలని కలిగి ఉంటూ ఎవరైతే సొంత దేశాలకి వెళ్ళారో వారు ఈ నిభందనలు అమలు అయ్యేలోగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఈ విధానంపై తుది నిర్ణయం ఇంకా ట్రంప్ తీసుకోలేదని త్వరలో ఓ నిర్ణయం తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నాయి వైట్ హౌస్ వర్గాలు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: