అమెరికాలో వివిధ ప్రాంతాలకి చెందిన భారతీయులు ఎంతో మంది వివిధ రంగాలలో స్థిరపడ్డారు. సహజంగానే నైపుణ్యతతో కూడిన ఆలోచనలు, ప్రతిభ కలిగి ఉండటంతో అమెరికాలో పలు విభాగాలలో కీలక పదవులని చేపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాకిలో కీలక పదవులను అలంకరిస్తున్న విదేశీయులు ఎవరైనా ఉన్నారంటే కేవలం భారతీయులేనని సగర్వంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు అమెరికాలోనే ఉంటూ అక్కడ విద్యని అభ్యసిస్తున్న ఇండో అమెరికన్ భారతీయ విద్యార్ధులు సైతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉంటారు..తాజాగా

IHG

అమెరికాలో భారతీయ సిక్కు సంతతికి చెందిన ఆన్మొల్ నారంగ్ అరుదైన ఘనతని సాధించింది. వెస్ట్ పాయింట్ లోని ప్రఖ్యాత అమెరికా మిలటరీ అకాడమీ నుంచీ డిగ్రీ పూర్తి చేసిన మొదటి సిక్కు యువతిగా రికార్డ్ క్రియేట్ చేసింది. వెస్ట్ పాయింట్ లో డిగ్రీ విద్యని పూర్తి చేసిన నారంగ్ తదుపరి విద్యని ఒక్లహామ్ లోని లాటన్ ఫోర్ట్ లో బేసిక్ ఆఫీసర్ లీడర్ షిప్ కోర్సుని చదవనుంది. ఈ కోర్సుని పూర్తి చేయగానే ఆమెకి జపాన్ లో ఒకినావా లో మొదటి పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన అనుమొల్ నారంగ్ తాను ఎంతో ఇష్టంగా ఈ విద్యని ఎంచుకుని చదివాను..ఈ రోజుకి ఇందులో డిగ్రీ పూర్తి చేయగలిగాను ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.

IHG

జార్జియా లో ఉన్న సిక్కులు నాకు ఎంతో మద్దతుని తెలిపారు. ఎంతో ఖటినతరమైన ఈ భాద్యతలు పూర్తి చేయడంతో సిక్కు లోకం ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోగలదు అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టు అయ్యిందని నారంగ్ తెలిపింది. నేను కోరుకున్న కలని నెరవేర్చుకోవడానికి నేను పడిన కష్టం అంతా ఇప్పుడు చాలా తేలికగా అయ్యింది అంటూ భావోద్వేగం అయ్యింది. ఇదిలాఉంటే నారంగ్ తాత భారత ఆర్మీ లో పనిచేశారు. తాతయ్య స్పూర్తితోనే తానూ కూడా ఆర్మీలో చేరాలని బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని చివరికి విజయం సాధించానని నారంగ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: