మంచి తనం అనేది చాలా వరకూ చచ్చిపోయింది అంటూంటారు..అసలు భూమిపై మంచి ఎక్కడ ఉందెహే..మానవత్వం కి నూకలు చెల్లిపోయాయి అంటారు. కానీ కూస్తో కాస్తే భూమిపై ఇలా అయినా ఉన్నామంటే కారణం ఎక్కడో ఒక చోట మంచి దాగుంది కాబట్టే. సరే ఒక్కసారిగా మానవత్వం పై ప్రస్తావన ఎందుకొచ్చింది అంటే. ఓ కంపెనీ యజమాని తన ఉద్యోగులు సొంత ప్రాంతాలకి వెళ్లేందుకు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఏకంగా వారికోసం విమానం బుక్ చేసి మరీ ఖర్చులు భరించి వారి వారి ప్రాంతాలకి పంపించాడు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది..మరి ఆ కధ ఏంటో ఇప్పుడు చూద్దాం..

 

లాక్ డౌన్ కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుకు పోయిన తన కంపెనీ ఉద్యోగుల గురించి తెలుసుకున్న వ్యాపారవేత్త అయిన హరి కుమార్ వారిని ప్రత్యేక విమానంలో భారత్ కి పంపారు. కరోనా సమయంలో వారు వారి వారి ప్రాంతాలకి వెళ్ళాలనుకున్న కోరికను నెరవేర్చాడు. అక్కడితో ఆగకుండా ఒక నెల బోనస్ కూడా ఇచ్చాడు అంతేకాదు వారి కుటుంభ సభ్యుల కోసం ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇచ్చాడు. ఇక్కడితో అయ్యిపోయింది అనుకోకండి..

 

 

భారత్ వెళ్ళిన తరువాత ఎవరైనా అక్కడే ఉండాలని భావిస్తే తప్పకుండా వారికి నా నుంచీ ఉద్యోగ సాయం అందుతుందని అందుకు అనుగుణంగా తమిళనాడు, కోయంబత్తూరు లో ఉన్న తన కంపెనీలలో ఉద్యోగాలు చేసుకోవచ్చని భంపర్ ఆఫర్ ఇచ్చాడు..అయితే

 

ఉద్యోగుల కి ఇంతగా ఎందుకు సాయం చేస్తున్నారు జీతాలు ఇస్తున్నారు కదా అనే ప్రశ్నకి ఆయన ఇచ్చే సమాధానం మాత్రం అదిరిపోయింది. అసలు ఇలాంటి బాస్ లు కూడా ఉంటారా అనిపించేలా ఆయన మాట్లాడారు. ఇంతకీ ఏమన్నారంటే. వారే లేకపోతే నా కంపెనీ లేదు, వారు కష్టపడ్డారు కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఓ సాధారణ వ్యక్తిగా యూఏఈ వెళ్ళిన హరి కుమార్ స్థానికంగా పెద్ద వ్యాపార వేత్తగా పేరు తెచ్చుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: