అమెరికాలో చదువుకోవాలని ఎంతో మంది విద్యార్ధులు ఆరాట పడుతుంటారు. చదువు పూర్తి అవ్వగానే అక్కడే ఉద్యోగం సంపాదించాలని, తమ కలలు నెరవేర్చుకోవాలని ఆరాట పడుతుంటారు. ముఖ్యంగా ఎంతో మంది విద్యార్ధులు అమెరికాలో ఎమ్మెస్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఓ కండిషన్ కూడా ఉంటుంది అదేంటంటే..అమెరికాలో ఎమ్మెస్ చేయాలంటే వారికి జీఆర్ఈ స్కోర్ కూడా ఉండాలి, ఈ అర్హత లేకుంటే అమెరికాలో ఎమ్మెస్ చేయడం అసాధ్యం...అయితే

 

జీఆర్ఈ (గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్) కి ఈ ఏడాదికి అమెరికా వర్సిటీలు మినహాయింపును ఇచ్చాయి. కరోనా నేపధ్యంలో దాదాపు 65 వర్సిటీలు ఈ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా తమ నిర్ణయాన్ని ప్రకటించాయి.నార్త్ ఈస్టర్న్ వర్సిటీలు, ఉక్లాండ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ విధానం ద్వారా ఎమ్మెస్ లో ప్రవేశాలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ కోవలోనే క్లేవ్ ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ టెక్సాస్ ఏఅండ్ఎం వర్సిటీ ఫెయిరీ డికిన్సన్ వర్సిటీ, రోవాన్ వర్సిటీ వంటి ప్రముఖ వర్సిటీలు అన్నీ తక్కువ తక్కువ స్కోర్ చేసిన వారిని కూడా అనుమతిస్తున్నాయి.అయితే

 

మరి కొన్ని వర్సిటీలు మాత్రం జీఆర్ఈ కి బదులుగా డ్యుయలింగ్ టెస్ట్, ఐఈఎల్టీఎస్ ద్వారా కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇదిలాఉంటే విదేశాలలో ఎమ్మెస్ చేయాలనుకునే ఇతర దేశాల విద్యార్ధులు అందరూ అత్యధికంగా అమెరికాలో చేయడానికే ప్రాధాన్యతని ఇస్తారు. కానీ అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీలు అన్నీ జీఆర్ఈ స్కోరు ఆధారంగా కానీ టోఫెల్ తో పాటు ఐఈఎల్టీఎస్ స్కోరును తప్పని సరిగా పరిగణలోకి తీసుకుంటాయి. ఆ స్కోరు ఉన్న వారికే సీట్లు ఇస్తూ ఉంటాయి అయితే చాలా మందని విద్యార్దులు కొన్ని విభాగాలలో వెనుకబడటం కారణంగా అమెరికాలో ఎమ్మెస్ చేయలేక పోయేవారు, కానీ ప్రస్తుతం సడలించిన నిభంధనల దృష్ట్యా వీరు ఈ అవకాశాలను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: