భారత సంతతి సిక్కు మహిళ ఇప్పుడు అమెరికాలో రికార్డు సృష్టించారు..తొలిసారిగా ఒక సిక్కు మహిళ అమెరికాలో మేయర్ గా ఎన్నికయ్యారు..కాలిఫోర్నియా లోని యుబా నగరానికి ఆమె మేయర్ గా నియమించబడ్డారు..ఆమె పేరు ప్రీత్‌ డిడ్‌బాల్‌ డిసెంబర్ 5 వ తేదిన ఆమె మేయర్ గా ప్రమాణస్వీకారం చేయనున్నారు అని టెలివిజన్ చానెల్ కెసీఆర్ఎ –టీవీ తెలిపింది.దేశంలో మరి కొంతమంది సిక్కులు కూడా మేయర్లుగా ఉన్నారు..కానీ మహిళా మేయర్ గా మాత్రం మొదటిసారి ప్రీత్‌ డిడ్‌బాల్‌ ఎన్నికయ్యారు.

 america first sikh woman mayor కోసం చిత్ర ఫలితం

నూజెర్సీలోని హొబ్బెకెన్‌ నగర మేయర్‌గా రవి భల్లా ఎన్నిక కాగా.. దేశంలో మేయర్‌గా ఎన్నికైన మొట్టమొదటి సిక్కు మహిళ ప్రీత్‌ డిడ్‌బాల్‌ అని ఆ టివి తెలిపింది. ప్రీత్‌ డిడ్‌బాల్‌ 2014లో యుబాసిటీ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె డిప్యూటీ మేయర్‌గా ఉన్నారు. ప్రీత్‌ డిడ్‌బాల్‌ కి మరొక రికార్డు కూడా ఉంది ఆమె కుటుంభం నుంచీ  కాలేజీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మొట్టమొదటి మహిళ కూడా ఆమెనట.

 america first sikh woman mayor కోసం చిత్ర ఫలితం

 

ఈ విజయానికి సంభందించి సిక్కు కూటమికి చెందిన జైదీప్‌ సింగ్‌ మాట్లాడుతూ మా మతానికి చెందిన ఒక మహిళ ఒక దేశంలో మేయర్ గా ఎన్నిక కావడం మాకు ఎంతో గర్వంగా స్పూర్తి దాయకంగా ఉంది అని తెలిపారు...న్యూ జెర్సీలో రవి భల్లా ఎన్నికైనప్పుడు నాలాంటి ఓ వ్యక్తి ప్రభుత్వ పదవికి ఎన్నికకావడాన్ని నేను చూడడం అదే మొదటిసారి అని ఆయన అన్నారు. ప్రీత్‌ డిడ్‌బాల్‌ తొలి మహిళా సిక్కు మేయర్ గా రికార్డు నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు ఎన్నారై లు అభినందనలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: