హెచ్ -1 బీ వీసాదారులకి ట్రంప్ మళ్ళీ ఇబ్బందుల్లో పెట్టనున్నారు..అమెరికాలో డబ్బు బాగా సంపాదించుకుని మంచి ఉన్నతమైన జీవితాన్ని గడపాలని భావిస్తూ అక్కడకికి వెళ్ళిన వారు ట్రంప్ ప్రకస్తున్న చర్యలకి ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు...సాధారణంగా హెచ్‌–1బీ వీసా ఉన్నవారు పెళ్లయ్యాక జీవిత భాగస్వామిని హెచ్‌–4 వీసాపై అమెరికా తీసుకెళ్తారు. అప్పట్లో ఒబామా కూడా ఈ హెచ్‌–4 వీసా పై అనుమతులు ఇచ్చారు..ఇప్పుడు ఈ అనుమతులని రద్దు చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి అని అమెరికా హోంల్యాండ్‌ శాఖ ప్రకటించింది.

 usvisa_bccl

ఇదే కనుకా జరిగితే సుమారు లక్ష మంది పైగా ఉద్యోగాలు వదులుకుని ఇంటికి పరిమితమై పోతారు అంటున్నారు నిపుణులు..ఈ విషయంలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని వెల్లడించారు కూడా. ప్రస్తుతం అమెరికాలో హెచ్‌–4 వీసాపై పనిచేస్తున్న భారతీయులు దాదాపు 70 వేల మంది ఉంటారనీ, వారిలోనూ 90 శాతం భార్యలేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.. 

 

సొంత దేశాన్ని వదిలి తగిన ప్రతిభ ఉంది వీరు అందరు ఎందుకు ఇంటికి పరిమితం కావాలి?  అంటూ వీరికి ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. వీరినీ పనిచేసేందుకు అనుమతించాలి..అని డిమాండ్లు రావడంతో హెచ్‌–4 వీసాపై వచ్చినవారు 2015 మే 26 నుంచి అమెరికాలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఒబామా తీసుకున్న నిర్ణయం ఇది..2015 జూన్‌–2017 జూన్‌ మధ్య వివిధ దేశాలకు చెందిన 1,04,748 మంది హెచ్‌–4 వీసాదారులు ఉద్యోగం చేసేందుకు అనుమతులు పొందారు. 2015లో 26,856 మంది, 2016లో 41,526 మంది 2017 జూన్‌ వరకు 36, 366 మంది హెచ్‌–4 వీసాదారులకు ఉద్యోగం చేసే అనుమతులు లభించాయి.

 Image result for trump-admin-plans-end-rule-allows-spouses-h1-b-visa-holders-work-us

ఇప్పుడు ట్రంప్‌ యంత్రాంగం హెచ్‌–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు నిలిపేస్తే వీరందరూ కొలువులు కోల్పోతారు. కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకునే వారికీ ఇబ్బందే.  కొన్ని కుటుంబాల్లో పిల్లలు అమెరికాలోనే పుట్టి వారికి అమెరికా పౌరసత్వమే సంక్రమించింది. అమెరికా పౌరసత్వం ఉన్న పిల్లలు కలిగిన హెచ్‌–4 వీసాదారులను పనిచేసేందుకు అనుమతించకపోవడం అన్యాయం అంటున్నారు..అయితే ..అమెరికా జాతీయుల ఉద్యోగాలను ఇతర దేశాల వారు కొల్లగొడుతున్నారనీ, తాను గెలిస్తే దీనిని కట్టడి చేస్తానన్నది ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీ..ఈ హామీ ని నిలబెట్టుకోవడం కోసమే అంటున్నారు..అయితే ఈ వీసా రద్దు విషయం త్వరలోనే అమలు కాబోతోంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: