చుట్టుపక్కల ఉన్నవారు సహబాష్ అంటే పెద్ద కిక్కు ఏముంది..మన రాష్ట్రంలోనో..లేక మనదేశంలో మనల్ని గుర్తించి సహబాష్ అంటే మనకి ఎలాంటి కిక్క్ వస్తుంది..అయితే మనదేశంలో కాదు పరాయి దేశంలో మన తెలుగోడు తన సత్తా చాటాడు ఆదేశం ప్రతిష్టాత్మకమైన అవార్డు గెలుపొందాడు..ఇప్పుడు ఫుల్ పాపులర్ అయ్యాడు..మనం కూడ ఒకసారి విషయం ఏంటో చూద్దాం.

 

మాములుగానే మన తెలుగోళ్ళు ఎక్కడ ఉన్నా సరే మన సత్తా చాటుతారు..అందుకే అమెరికాలో పౌరులకి మనం అంటేనే అరికాల్లో మంటలు వస్తాయి..అయితే తాజాగా కెన్యాలో మన తెలుగు వ్యక్తికీ అరుదైన సత్కారం లభించింది..కెన్యాలో ఈ వ్యక్తీ అందిస్తున్న సేవలకి గాను దేశ సర్కారు అందించే ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు..

 

ఏపీలో గుంటూరు  జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరుకు చెందిన పమిడిముక్కల వెంకట సాంబశివరావు 1981లో ఏంబీఏ చదివేందుకు కెన్యా వెళ్లారు. చదువు తరువాత అక్కడే స్థిరపడ్డారు..తోలుత పరిశ్రమను ఏర్పాటు చేసి.. దాదాపు 25 వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. కెన్యా లెదర్ డెవలప్ మెంట్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్....టానర్స్ అసోసియేషన్ చైర్మన్....కెన్యా విజన్ -2030 ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా.. ఇలా పలు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు కెన్యా దేశపు అరుదైన గౌరవం లభించింది...ఆ దేశ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మకమైన ఎల్డర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ హార్ట్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: