ఎన్నారైలు మరొక ప్రత్యేకతని పొందారు..విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు.భారతదేశం లో జరిగే అన్ని ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నిక కమిషన్ చేస్తున్న ప్రయత్నాలు సఫల అయ్యేలా ఉన్నాయి..గత మూడేళ్లలో ఎన్నడూలేని విధంగా విదేశీ ఓటర్ల సంఖ్య రెండు రెట్లు పెరిగింది దాంతో విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్యతో పోలిస్తే ఈ ఓటర్ల సంఖ్య చాలా తక్కువని - వీరిని కూడా ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను త్వరితగతిన చేయాలని ప్రభుత్వం ఈసీ స్పష్టం చేసింది. 

nri voting కోసం చిత్ర ఫలితం

ప్రవాస భారతీయులకి పరోక్షంగా ఓటు హక్కుని కలిగించేందుకు లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది..దాంతో మళ్ళీ ఎన్నారై ఓటు వ్యవహారం మళ్ళీ తెరమీదకి వచ్చింది..ఎన్నికల సమయమ్లో ఇండియాకి వచ్చి వెళ్ళడం చాలా మందికి ఎంతో కష్టంగా ఉంటోంది..దాంతో వారికి ఓటు వేయాలని ఉన్నా సరే పరిస్థితులకి తగ్గట్టుగా ఆగిపోతున్నారు..అయితే వీరికి పరోక్ష ఓటింగ్ హక్కును కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ బిల్లును తలపెట్టింది.

 

ఎంతో కాలం నుంచీ విదేశాల్లో ఉంటున్నప్పటికీ ఎన్నారైలు తమ ఓటు హక్కుని వదులుకోవడం లేదు ఇప్పటికీ తాము నివసిస్తున్న ప్రాంతాలలో వారికి ఓటు హక్కు ఉంటోంది..అయితే ఇక్కడికే వచ్చి ఓటు వేయాలనే నిబంధన వారి ఓటు హక్కుని కాలరాస్తోంది..ఈ సమస్యని..ఈ సమస్యను పరిష్కరించటంలో భాగంగా తన తరఫున పరోక్షంగా ఓటువేసే హక్కును భారతదేశంలో వున్న తమవారికి అందించే అవకాశాన్ని ఈ బిల్లు ద్వారా ఎన్నారైలకు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అన్ని ఎన్నికల్లోనూ ఓకే వ్యక్తి ఎన్నారై ఒటరు తరఫున ఓటు వేసే అవకాశం ఉండదు.

 nri voting కోసం చిత్ర ఫలితం

ఒకసారి ఓటు వేసిన వ్యక్తి మరొకసారి ఓటు వేసే సమయంలో అతడిని ఉపయోగించకూడదు అనే షరతు కూడా ఈ బిల్లులో ఉంది..2012 వివరాల ప్రకారం  ఇతర దేశాల్లో ఉంటున్న ఎన్నారైల సంఖ్య కోటి 37వేల మంది..ఇప్పటికే 11846మంది విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిసంఖ్య ఈ మూడేళ్ల కాలంలో రెండింతలైంది. దీని దృష్ట్యానే వీరి సంఖ్యను మరింతగా పెంచాలన్న ఆలోచనపై కేంద్రం దృష్టి సారించింది..తాజాగా వచ్చిన ఈ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం కనుకా లభిస్తే దేశంలో తమ ఓటు హక్కు వినియోగించుకునే ఎన్నారైల సంఖ్య ఎక్కువ అవుతుంది అనడంలో సందేహం లేదు..

 nri votes కోసం చిత్ర ఫలితం

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: