అమెరికాలో ఉన్న భారతీయులు అందరు ఇండియా వచ్చేయాలని మహింద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహింద్రా అన్నారు..అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసాపై పెట్టిన నిభందనలు కారణంగా మన భారతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు..అన్న విషయం తెలిసిందే..ఈ విషయంలో అమెరికా కావాలనే నిభందనలు కటినతరం చేసింది..అయితే ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఆనంద్ మహీంద్రా ఈ విధంగా స్పందించారు..

 Image result for h1 b visa indian nri

అసలు విషయం ఏమిటి అంటే.. '' బై అమెరికన్.. హైర్ అమెరికన్'' అనే పాలసీ తెలిసిందే అయితే ఈ నియమాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకువచ్చారు. అంతేకాదు “డీహెచ్ఎస్” ఇచ్చిన ప్రతిపాదన ప్రకారం చుస్తే అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న ఎంతో అనేకమంది భారతీయులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.ఈ నియమం ప్రకారం అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకున్న వారు ఎవరైనా సరే ఇక మీదట హెచ్‌1-బీ వీసాను పొడిగించుకునే వీలులేకుండా చేయాలన్న నిబంధనే ఇందుకు కారణం.

 Image result for h1 b visa indian nri

ఈ కారణం వలన దాదాపు 75వేల మంది హెచ్1 బీ వీసా వినియోగదారులు స్వదేశాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంపై మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు..అమెరికా పెట్టే నిభందనల కారణంగా మనవాళ్ళు స్వదేశానికి వచ్చేలా ఉంటే మీరు వెంటనే వచ్చేయండి..మన సత్తా ఏమిటో వారికి బాగా తెలుసు మనకి ఇంకా బాగా తెలుసు ఇక్కడ ఉండి మనదేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అంటూ ట్వీట్ చేశారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: