ట్రంప్ “హెచ్‌-1బీ వీసాని ఎలా కఠినతరం చేయాలో అని ఆలోచిస్తూ పావులు కదుపుతూ ఉంటే..మరో వైపు వీరి పరిమితిని పెంచాలి అంటూ రిపబ్లికన్‌ సెనేటర్లు కోరుతున్నారు... ఎంతో అత్యుత్తమమైన ప్రతిభ కలిగిన వారిని అమెరికా తీసుకు వచ్చే లక్ష్యం తో ఏర్పడిన ఈ  హెచ్‌-1బీ వీసాలను పెంచాలంటూ ఇద్దరు రిపబ్లిక్‌ సెనేటర్లు గురువారం ఓ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు.  ఆరిన్ హాచ్, జెఫ్ఫ్ ఫ్లాక్ అనే సెనేటర్లు 'ది ఇమ్మిగ్రేషన్‌ ఇన్నోవేషన్‌( I-‍ స్క్వేర్డ్‌) యాక్ట్‌ 2018 పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. చట్టబద్ధమైన స్టేటస్‌ను కోల్పోకుండానే హెచ్‌-1బీ వీసా హోల్డర్స్‌ తమ ఉద్యోగాన్ని మార్చుకునేలా కూడా ఈ బిల్లు ద్వార అమలులోకి వచ్చేలా ప్రదిపాదనలు చేశారు..

 Image result for hi b visa american senators bill

అయితే ఈ కీలక బిల్లుకి ఐటీ దిగ్గజమైన మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌ లాంటి టాప్‌ అమెరికన్‌ ఐటీ కంపెనీలు..యూఎస్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇండస్ట్రీ కౌన్సిల్‌ లాంటి టాప్‌ ట్రేడ్‌ బాడీలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో  అమెరికా అగ్రగామిగా ఉండాలంటే ఈ బిల్లు తప్పని సరి అని వారి వాదన..అయితే  హెచ్‌-1బీ ప్రొగ్రామ్‌లో సంస్కరణలు వలన మోసాలని తగ్గిస్తుందని ..అక్కడి వర్కర్లని కాపాడుతుందని ఎంతో మందికి గ్రీన్ కార్డు సౌకర్యం కలిగిస్తుందని తెలిపారు.

 Image result for hi b visa american senators bill

ఇదిలా ఉంటే ఎంతో కీలకంగా ఉన్న ఈ వీసాల ద్వారా వచ్చే ఫీజులని “ఎస్‌టీఈఎం” వర్కర్ల శిక్షణ, విద్యను ప్రమోట్‌ చేయడానికి ఉపయోగించాలని...వీసా పీజులను పెంచడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఎస్‌టీఈఎం విద్యకు, వర్కర్‌ శిక్షణ కార్యక్రమాలకు 1 బిలియన్‌ డాలర్ల కొత్త ఫండింగ్‌ను అందించామని సెనేటర్లు చెప్పారు..అయితే అమెరికా అభివృద్దిలో ఎంతో కీలక మైన ఈ బిల్లు  గెలుస్తుందనే భావిస్తున్నామని తెలిపారు. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: