అమెరికాలో ఉంటున్న ఎంతో మంది ఎన్నారైలకి ఇప్పుడు పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య “గ్రీన్ కార్డు”  ఈ కార్డు విషయంలో భారతీయులని..అలాగే వలసలు వెళ్లిన  ఎంతో మంది ప్రవాసీయుల్ని ముప్పు తిప్పలు పెట్టిస్తున్నాయి అంటున్నారు అయితే ట్రంప్ సర్కార్ “గ్రీన్ కార్డు” రాకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే  తాజాగా ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని విధానాలు ఊరటనిస్తున్నాయి..అయితే గ్రీన్ కావాలంటే కోట్లు పెట్టి వీసా కొనుక్కోండి అంటున్నారు..మీరు విన్నది నిజమే కోట్లు ఉంటే చాలు గ్రీన్ కార్డు మీ ముందుకు వచ్చి వాలిపోతుంది అంటున్నారు..

 Image result for e b 5 investor program

డబ్బుంటే కొండ మీద కోతి దిగోస్తుంది గ్రీన్ కార్డు ఓ లెక్కా అంటున్నారు...కాసులుంటే చాలు ఒక్క వీసా ఏంటి 'గ్రీన్ కార్డు' 'పర్మినెంట్ రెసిడెంట్ షిప్' అమాంతం అలా మీ కౌగిలిలో వాలిపోతాయి. కొన్ని దేశాలు అయితే ఏకంగా పౌరసత్వాన్ని కూడా ఇచ్చేస్తున్నాయి.'టోఫెల్' 'జీఆర్ఈ'లతో కూస్తీ పడి, విదేశాల్లో పెద్ద చదువులు చదువుకొని, ఉద్యోగాలు తెచ్చుకొని అక్కడే ఉంటూ 'పర్మినెంట్ రెసిడెన్స్ షిప్' కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పని లేదు.

 Image result for e b 5 investor program

 డబ్బులు పెడితే చాలు ఇన్స్‌స్టెంట్ కాఫీ తాగినంత తేలిగ్గా అంతా క్షణాల మీద అయిపోతుంది. ఒక్క మీకే కాదు. మొత్తం మీ కుటుంబానికి 'పర్మినెంట్ వీసా'లు వచ్చేస్తాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా ఎన్నో దేశాలు డబ్బుల కోసం వీసాలు అమ్ముకుంటున్నాయి. మనం చేయాల్సిందల్లా వాళ్లు అడిగినంత మొత్తాన్ని పెట్టుబడి రూపంలో ఆ దేశంలో వ్యాపారంలో పెడితే చాలు.ఇలా చేయడం వలన . “ఇ.బి 5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం” కింద రూ.6.37కోట్లు చెల్లిస్తే మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా అమెరికన్ 'గ్రీన్‌కార్డు' వచ్చి మీ వాళ్ళో వాలుతుంది అంటున్నారు.

Image result for e b 5 investor program

మరింత సమాచారం తెలుసుకోండి: