ఫిబ్రవరి 1న దక్షిణాఫ్రికాలోని బెనిన్‌ తీరప్రాంతంలో 22 మంది భారత నావికులతో వెళ్తున్న ఎం.టి మెరైన్ ఎక్స్‌ప్రెస్ గల్ఫ్‌ ఆఫ్‌ గునియా నుంచి మాయమైన సంగతి అందరికీ తెలిసిందే..అయితే ఈ నౌకని దక్షిణాఫ్రికా సముద్ర జలాల్లో సముద్ర దొంగలు హైజాక్ చేశారు..అయితే ఈ విషయంలో ఎంతో అందోళన చెందిన  భారత ప్రభుత్వం..విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్  ద్వారా వివరాలు తెలుసుకున్నారు..అయితే తాజా సమాచారం ప్రకారం..

 Image result for mt marine express

భారత నావికుతో ఉన్న ఆయిల్ ట్యాంకర్ నౌక ఆచూకీ దొరికింది..భారత నావికులతో పాటు ఆయిల్ ట్యాంకర్‌ను మంగళవారం సముద్రపు దొంగలు సురక్షితంగా వదలిపెట్టారు...ఈ విషయాలని షిప్పింగ్‌ కంపెనీ ప్రకటించింది...అందులో ఉన్న వారందరూ  సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. హైజాక్ అయిన ఆయిల్ ట్యాంకర్‌ నౌకలో 13,500 టన్నుల గ్యాసోలిన్‌ను తీసుకెళ్లగా దాని విలువ దాదాపు 8.1మిలియన్‌ డాలర్లు ఉంటుందని తెలిపారు..నౌకలోని భారత నావికులతో పాటు, అందులోని సరుకు కూడా సురక్షితంగా ఉన్నట్టు ఆంగ్లో ఈస్టరన్ పేర్కొంది.

 Image result for sushma swaraj

ఇదే తరహాలో నెల రోజుల క్రితం వేరొక నౌకని దొంగిలిచ్చినట్టుగా తెలుస్తోంది..అయితే భారత నావికులు ఉన్న నౌకని విడిపించడానికి వారికి తగిన డబ్బు చెల్లించడంతో భారత నావికులను విడుదల చేశారని తెలిపారు..అయితే ఈ విషయంపై  సుష్మా స్వరాజ్  ట్విట్టర్ వేదికగా చాలా సంతోషకరమైన విషయం తెలిపారని కృతజ్ఞతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: