గత కొంతకాలంగా “హెచ్‌–1బీ”  విషయంలో ఎంతో సందిగ్థత నడుస్తోంది..ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత అక్కడ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలలో స్వదేశీ నిరుద్యోగులకి పోటీగా వస్తున్న విదేశీ ఉద్యోగులకి అడ్డుకట్ట వేస్తానని చెప్పిన మాట ప్రకారం ట్రంప్ నడుచుకుంటున్నాడు వీసా అమలు చేసే విషయం నుంచీ ఎప్పటి నుంచో అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వారిపై వారి భాగస్వాములపై ఆంక్షల వరకూ అన్ని చేస్తూ వచ్చాడు..అయితే కొంత కాలం క్రితం అమెరికాలో ఉద్యోగం చెసెవారీ భాగస్వాములని ఉద్యోగాల నుంచీ తొలగించే విషయంపై కటినమైన నిర్ణయం తీసుకున్న ట్రంప్ సర్కార్..ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కొంతకాలం పెండింగ్ లో పెట్టింది..వివరాలలోకి వెళ్తే.

h1b visa trump changes కోసం చిత్ర ఫలితం

హెచ్‌–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్‌ సర్కార్ తెలిపింది..ఈ ప్రకటనతో అక్కడ ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులకి ఊరక లభించింది..ఈ ప్రకటనని  మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) ప్రకటించింది. “హెచ్‌–4” వీసాల మీద వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్‌–1బీ వీసాదారుల భాగస్వాములను ఉద్యోగాల నుంచి తొలగించే అంశంపై జూన్‌ వరకు ఏ నిర్ణయం తీసుకోం. ఈ నిర్ణయం దేశంపై ఆర్థికంగా ఎటువంటి ప్రభావం చూపుతుందనే దాన్ని పరిశీలించాల్సి ఉందని వెల్లడించారు..

h1b visa trump changes కోసం చిత్ర ఫలితం

గతంలో ఉన్న ఓబమా ప్రభుత్వం..హెచ్‌–1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి భార్యలు/భర్తలు అమెరికాలోని వివిధ కంపెనీల్లో హెచ్‌–4 డిపెండెంట్‌ వీసాల కింద పనిచేసేందుకు అవకాశం కల్పించింది...ఆ నిర్ణయంలో అధికసంఖ్యలో ఉద్యోగాలలో చేరిపోయారు..ఆ తరువాత గత ఏడాది ట్రంప్ దీనికి విరుద్దంగా ప్రకటన చేయడంతో ఎంతో మంది భారతీయ ఉద్యోగులు అందోళనకి లోనయ్యారు..తాజా నిర్ణయంతో ఒకింత ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు..అయితే ఈ నిర్ణయం ఆర్ధిక స్థితి గతులపై గనుకా ప్రభావం చూపిస్తే మాత్రం వెంటనే వెనక్కి తగ్గే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: