ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 39 మంది భారతీయ కార్మికులను “ఐఎస్” ఉగ్రవాద సంస్థ పొట్టన పెట్టుకుంది..తమ వాళ్ళు ఎక్కడో అక్కడ బ్రతికే  ఉన్నారని అనుకుంటూ ఉన్న భారతీయు కుటుంభాలు ఇప్పుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటనతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు...మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని సుష్మాస్వరాజ్ వెల్లడించారు. 2014లో ఇరాక్‌లో కిడ్నాప్ అయిన 39 మంది భారతీయల ఆచూకీ కోసం భారత్ చేయని ప్రయత్నం అంటూ లేదు.

 Image result for sushmaa said parlament

అయితే ఇప్పుడు మోసుల్ లో వీరిని పూడ్చిపెట్టిన చోటును రాడార్లు కనిపెట్టాయని, మృతదేహాలను బయటకు తీయగా అప్పటికే పూర్తిగా కుళ్ళిపోయాయి అని తెలిపారు..మృతదేహాలను పరీక్షల కోసం బాగ్దాద్ పంపగా  డీఎన్ఏ శాంపుల్స్ 70 శాతం వరకూ మ్యాచ్ అయ్యాయని సభకు తెలిపారు. ఆ అవశేషాలను తీసుకువచ్చేందుకు జనరల్ వీకే సింగ్ బాగ్దాద్ వెళ్తున్నారని తెలిపారు.. ఆ అవశేషాలను తొలుత అమృత్ సర్, తర్వాత పాట్నా, కోల్‌కతాలకు తరిలిస్తామని చెప్పారు. కాగా, ఇరాక్‌లో కిడ్నాప్ అయిన తమవారంతా ఎక్కడో ఒకచోట బతికే ఉంటారని కలలు కన్న వారి కుటుంభ సభ్యులకి ఇది తీరని శోకం అనే చెప్పాలి..ఈ విషయంపై రాజ్య సభ సభ్యులంతా నిమిషం పాటు మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: