ఆస్ట్రేలియా దాదాపు అమెరికా ఇచ్చిన షాక్ కంటే కూడా భారీ షాక్ భారతీయులకి ఇచ్చింది...ఈ నిర్ణయంతో దాదాపు లక్ష మంది ఎన్నారైల పరిస్థితికి అగమ్యగోచరంగా మారింది..అమెరికా పాటిస్తున్న విధానాలనే ఇప్పుడు ఆస్ట్రేలియా  కూడా పాటిస్తోంది..అమెరికన్స్ కోసం ట్రంప్ తీసుకున్న విదేశీ ఉద్యోగుల వీసాలపై నిర్ణయాలని ఆస్ట్రేలియా  కూడా పాటిస్తోంది ఇప్పుడు ఈ వార్త అక్కడే ఉంటున్న ఎంతో మంది ఎన్నారై లకి నిద్రపట్టకుండా చేస్తోంది...వివరాలలోకి వెళ్తే..

 Image result for Australia scraps 457 visa popular among Indians; removes over 200 jobs from short-term stream

ఆస్ట్రేలియా 457 వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేసింది. దీనిని ఎక్కువగా ఇండియన్సే వాడేవారు..అయితే ఇప్పుడు ఈ వీసా స్థానంలో మరిన్ని కఠిన నిబంధనలతో టెంపరరీ స్కిల్స్ షార్టేజ్ వీసా ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇంగ్లిష్‌పై మంచి పట్టు ఉండటంతో మరింత నైపుణ్యం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా ఈ 457 వీసా ప్రోగ్రామ్ కింద 95 వేల మంది విదేశీ ఉద్యోగులకు ఆస్ట్రేలియాలో పనిచేసే అవకాశం దక్కేది.

 Image result for Australia scraps 457 visa popular among Indians; removes over 200 jobs from short-term stream

457 వీసా కింద నైపుణ్యం ఉన్న ఆస్ట్రేలియా వర్కర్ల కొరత ఉన్నపుడు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు విదేశీ వర్కర్లను తీసుకునే అవకాశం అక్కడి కంపెనీలకు ఉంటుంది...అయితే ఇందులో సింహబాగం ఇండియన్సే ఉండేవారు. 95 వేల వీసాల్లో 25 శాతం భారతీయులకే దక్కేవి. ఆ తర్వాతి స్థానాల్లో 19.5 శాతంతో యూకే, 5.8 శాతంతో చైనా ఉండేవి. ఈ వీసా తీసుకున్న విదేశీ వర్కర్లు ఫ్యామిలీతో పాటు ఆస్ట్రేలియాలో నివాసం ఉండే చాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీసా ప్రోగ్రామ్ వల్ల ఎంతో మంది స్థానిక ఆస్ట్రేలియన్లకు ఉద్యోగాలు దొరకడం లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ కారణంగా  457 వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేస్తున్నట్లు గతేడాది ఏప్రిల్‌లోనే ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ ప్రకటించారు.

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: