అనేక మార్పులు చేర్పుల తరువాత మళ్ళీ హెచ్‌1బీ వీసా ప్రక్రియ మొదలయ్యింది..వీసాల జారీ ప్రక్రియ సోమవారం నుంచీ ప్రారంభం కానుంది..అమెరికాలో ఉద్యోగాలు కోసం విదేశీయులకి అందించే హెచ్‌1బీ వీసా ప్రక్రియ సోమవారం నుంచీ మొదలు కానుంది..ప్రపంచంలో అధికంగా భారత్ నుంచీ ఐటీ నిపుణులు ఎక్కువగా దరకాస్తు చేసే ఈ వర్క్ వీసా నిభంధనలని ఇటీవల తరం సర్కార్ ఎంతో కటినతరం చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే..

 Image result for h1b visa

అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే అమెరికా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్‌1బీ దరఖాస్తులను ఈ నెల 2 నుంచి స్వీకరించనున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది...ఈ వీసాల జారీలో పొరపాట్లు జరగకుండా అత్యంత కఠినమైన చర్యలను చేస్తున్నట్టుగా తెలిపింది..

 Image result for h1b visa

అయితే ఈ వీసా జారీ విధానంపై స్పందిస్తూ ఇమిగ్రేషన్‌ అటార్నీలు “ఈసారి తిరస్కరణకు గురయ్యే దరఖాస్తుల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొనడం” అందరినీ షాక్ కి గురిచేసింది..హెచ్‌1బీ అనేది నాన్‌–ఇమిగ్రెంట్‌ వీసా. అమెరికా కంపెనీలు ఈ వీసా ఉన్న విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈసారి ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే అన్నిటినీ తిరస్కరించే అవకాశం ఉందని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టం చేసింది..అయితే ఈ సారి భారత్ నుంచీ ధరకాస్తులు ఎక్కువగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోందని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: