భారత్‌ నుంచి పరాయి గడ్డపై కి ఉద్యోగానికి వేల్లవారు కానీ మరింకేకారణం వలనో విదేశాలకి వెళ్ళేవారు తప్పకుండా అక్కడి దేశ పద్దతులు, చట్టాలు, ఆచారాలు గురించి తెలుసుకోవాలి..ఎందుకంటే భారత్ లో ఉన్నంత స్వేఛ్చ మరెక్కడా ఉండదు అక్కడ చట్టాల ప్రకారం నిబంధలనల ప్రకారం నడుచుకోక పొతే తప్పకుండా శిక్షార్హులు అవుతారు ఫలితంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోవాల్సి ఉంటుంది.. అయితే తెలిసీ తెలియక, మరో కొంతమంది ట్రాఫిక్‌ ఉల్లంఘనలు..రోడ్డు ప్రమాదాలు.. పని ప్రదేశంలో ప్రమాదాలకు కారకులైనవారు..గొడవలు..ఆర్థికపరమైన మోసాలు, ఇతర మోసాలు..మద్యం సేవించడం..మద్యం వ్యాపారం, జూదం, లంచం..వీసా నిబంధనలు..కస్టమ్స్ ఇమిగ్రేషన్‌ ఉల్లంఘనలు..చెక్‌ బౌన్స్ కేసులలో కొందరు జైళ్లలో మగ్గుతున్నారు.

 Image result for /indian-prisoners-abroad-7985-most-jailed-gulf-countries-

అయితే ఇలా దాదాపు 2017 డిసెంబర్‌ 28 వరకూ  76 దేశాలలోని జైళ్లలో 7,985 మంది భారతీయులున్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్‌  తెలిపారు..విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల స్థితిగతుల గురించి లోక్‌సభ సభ్యులు నినాంగ్‌ ఎరింగ్, కైలాష్‌ ఎన్‌ సింగ్‌ దేవ్, జితేందర్‌రెడ్డి తెలిపారు కొన్ని దేశాలలోని గోప్యతా చట్టాల వల్ల వారి పూర్తీ వివరాలు తెలియడం లేదు అన్నారు.

 Image result for indians suffering gulf jails

వీరిలో చాలా మంది  శిక్షా కాలం పూర్తయిన సరే వందలాది మంది జైళ్లలోనే  ఉన్నారు..ఖైదీలను స్వదేశానికి తీసుకువచ్చే చట్టం 2013 (రిపాట్రియేషన్‌ ఆఫ్‌ ప్రిజనర్స్‌ యాక్ట్‌ 2013) ప్రకారం ఇప్పటివరకు 170 దరఖాస్తులు వచ్చాయని  అయితే దానిలో దాదాపు 62 మంది విదేశీ జైళ్ల నుంచి భారత్‌ జైళ్లకు బదిలీ అయ్యారని భారత్‌ ఇప్పటివరకు 30 దేశాల ఖైదీలతో  బదిలీ ఒప్పందం చేసుకున్నదని ఇవికాకుండా ఇంటర్‌ అమెరికన్‌ కన్వెన్షన్‌ను ఆమోదించిన సభ్య దేశాలతో భారతదేశం ఖైదీల బదిలీకి అభ్యర్థనలు పంపడానికి, స్వీకరించడానికి అర్హత కలిగి ఉన్నది. యూఏఈ, భారత్‌ మధ్య 2011 నవంబర్‌ 2న ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది.

 

 Image result for indians suffering gulf jails

అప్పటి భారత హోంమంత్రి పి.చిదంబరం, యూఏఈ దేశ ఉప ప్రధాని, హోం మంత్రి లెఫ్టినెంట్‌ జనరల్‌ షేక్‌ సైఫ్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహయాన్‌లు ఈ ఒప్పందంపై ఢిల్లీలో సంతకాలు చేశారు. 2015 మార్చి  25న ఖతార్‌తో కూడా ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది...అయితే ఈ ఒప్పందాలు జరిగినా సరే ఇప్పటికీ ఆచరణకి నోచుకోక పోవడం దారుణమని అంటున్నారు..సుమారు  ఏడు రాజ్యాలలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న 1,628 మందిలో శిక్షపడిన వందలాది మంది భారతీయ ఖైదీలతో పాటు ఖతార్‌లోని 196 మందికి ఈ ఒప్పందం వలన లాభం కలుగుతుంది...విదేశీ జైళ్లలో మగ్గుతున్న పేద ప్రవాసీ కార్మికులకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ సహాయం  అందించాలి...వారికి చిన్న చిన్న జరిమానాలు విధించి వారిని విడిపించే కృషి చేయాలి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: