తెలుగు వారు అందరు ఎక్కడ  ఉన్నా సరే మన తెలుగు సాంప్రదాయాలు మాత్రం వదులుకోరు..ఎదో ఒక సందర్భంగా మన సంస్కృతి ని మననం చేసుకుంటూనే ఉంటారు..ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా )తెలుగు  సాంప్రదాయాలని కొనసాగించడంలో ఎప్పుడు ముందు ఉంటుంది ప్రతీ ఏటా తెలుగు సంస్కృతీ ,సాంప్రదాయాలు మరియు కవితలు ఇలా ఎదో ఒక విధంగా తెలుగుదనాన్ని చాటి చెప్పే కార్యక్రమాన్ని చేపడుతూనే ఉంటారు..

 NATA Literary competition - Sakshi

అయితే అందులో భాగంగానే ఈ సారి నాటా 2018 సాహిత్య పోటీలకు రచయితలు,కవులకు ఆహ్వానం పలికింది..అందుకు సారంగా అనే వెబ్ సాహిత్య పక్ష పత్రిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది..ఈ పోటీలో గెలుపొందిన విజేతలకి జూలై 6  నుంచి  8  వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న నాటా సభల్లో కథలు, కవిత్వ పోటీల ఫలితాలు వెలువరించనున్నారు.

 

ఈ కథల పోటీల్లో మొదటి బహుమతికి  రూ. 15 వేలు, రెండో బహుమతికి రూ. 10 వేలు, మూడో బహుమతికి రూ. 5 వేలు ఇవ్వనున్నారు...అయితే గతంలో కూడా ఎటువంటి పోటీలకి తెలుగు వారి నుంచీ విశేష స్పందన లభించింది.. అయితే “కవితల”  పోటీల్లో మొదటి బహుమతికి  రూ. 5 వేలు, రెండో బహుమతికి  రూ. 3 వేలు,  మూడో బహుమతికి వెయ్యి రూపాయలుగా ప్రకటించారు.జూన్‌ 1లోపు కవితలు, కథలు పంపించాలని నాటా ఓ ప్రకటనలో తెలిపింది. పోటీల్లో గెలుపొందిన కథలు, కవిత్వాలను సారంగ (magazine.saarangabooks.com)లో ప్రచురిస్తారు. అదేవిధంగా  రచనలు  Literaty@nata2018.org  పంపించాలని సాహిత్య కమిటీ ఛైర్‌ జయదేవ్‌ మెట్టుపల్లి విజ్ఞప్తి చేశారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: