నెలరోజుల క్రితం హెచ్ -1B వీసా ని అత్యదికగా పొందిన ఎన్నారైలు ఎవరనే జాబితాని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ప్రకటించారు ఆ జాబితాలో భారత ఎన్నారైలే అత్యధికంగా ఉన్నారంటూ ఒక ప్రకటనలో తెలిపింది..అంతేకాదు ట్రంప్ ప్రవేశ పెట్టే వీసా నిభంధనలు సైతం భరత్ ఎన్నారైలని కట్టడి చేయడానికేనని..వారిని కట్టడి చేస్తే తమ పౌరులకి ఉద్యోగాల కల్పన ఎంతో సులభంగా ఉంటుందనేది అమెరికా భావన..ఇదిలాఉంటే

Image result for indian nri spouse

ఇప్పుడు హెచ్‌–4 (స్పౌస్‌) వీసా విషయంలో సైతం అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల తాజా నివేదికలో 93 శాతం మంది భారతీయులు ఈ విసాని ఉపయోగించుకున్నారని తెలిపారు..ఇందులో ఐదో వంతు కంటే ఎక్కువ (28,033) మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారని, టెక్సాస్, న్యూజెర్సీల్లో మరో 20 శాతం మంది పనిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.

Related image

అమెరికన్‌ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాంగ్రెస్‌ ఇండిపెండెంట్‌ కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (సీఆర్‌ఎస్‌) ఎప్పటికప్పుడు సర్వేలు చేసి నివేదికలు రూపొందిస్తుంది. దీనిలో భాగంగా ఆ సంస్థ హెచ్‌–4 వీసాలపై తాజాగా 9 పేజీల నివేదిక విడుదల చేసింది. హెచ్‌–4 కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారతీయులకు, 5 శాతం చైనీయులకు, ఇతర దేశాలకు చెందిన వారికి రెండు శాతం వీసాలిచ్చినట్టు తెలిపింది.

.

 


మరింత సమాచారం తెలుసుకోండి: