విదేశాలలో ఉండే  భారత్ ఎన్నారైలు ఎంతో మంది తమ ప్రాంతంలోని వారిని వివాహం చేసుకుని మళ్ళీ విదేశాలు తీసుకుని వెళ్ళాక అక్కడ వారిని హింసలకి గురిచేయడం మరియు పెళ్ళిళ్ళు చేసుకున్న తరువాత వారిని ఇండియాలోనే వదిలేసి భర్త ఒక్కడే విదేశాలు వెళ్ళిపోవడం ఇలా  ఎన్నెన్నో నేరాలు రోజువారి వెలుగు చూస్తూనే ఉన్నాయి అయితే వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఆ చట్టాల అమలుని నిభంధనలని మరింత ఖటినతరం చేయనుంది కేంద్రం..

Image result for menaka gandhi

అయితే ఈ మేరకు కేంద్రం శిశు  సంక్షేమ శాఖామంత్రి మేనకా గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు..ఎన్‌ఆర్‌ఐలు వివాహం చేసుకుంటే, తప్పనిసరిగా వివాహం జరిగిన 48 గంటల్లోనే దగ్గరలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. భారతదేశంలో జరిగే ఎన్‌ఆర్‌ఐ వివాహాలకు ఈ నియమం వర్తిస్తుందన్నారు.

Image result for nri indians

ఒకవేళ పెళ్ళైన జంట ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే వాళ్ల పాస్‌పోర్ట్, వీసా జారీలను వెంటనే ఆపేస్తామని భారత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు..పెళ్ళిళ్ళు చేసుకున్న ఎన్నారైలు తమ భార్యలని ఇండియాలోనే వదిలేసి వెళ్తున్న సంఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు కొత్త నిబంధన తీసుకురానుంది. ఇటీవల పలు సందర్భాల్లో ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: