భారత్ నుంచీ ఎంతో మంది విదేశాలకి ఉద్యోగ రీత్యా చదువు ,వ్యాపార రీత్యా వెళ్తూ ఉంటారు..అక్కడికి వెళ్లడానికి ఎన్నో కష్టాలని ఓర్చుకుని మరీ వెళ్తే అక్కడ ఎదురయ్యే నిభందనలు ఎంతో మందిని నిరుశ్చాహంలోకి నెట్టేస్తున్నాయి..అక్కడ దేశీయుల కోసం సవరిస్తున్న సవరణలు ప్రవాసాంధ్రులు కి మాత్రం చెమటలు పట్టిస్తున్నాయి..భారత్ నుంచీ ఎంతో మంది సౌదీ వండి అరబ్ కంట్రీస్ కి వెళ్లి చేతినిండా డబ్బు సంపాదించుకుంటారు..అయితే ఈ క్రమంలో దాదాపు 2 లక్షలకి పైగా తెలుగురాష్ట్రాల వారు అక్కడ ఫ్యామిలీ డ్రైవర్స్ గా పని చేస్తున్నారు..

 Image result for saudi revolution women car driving

అయితే సౌదీలో మహిళల పై డ్రైవింగ్ నిషేధం ఎత్తేసిన తరుణంలో రోడ్ల పైకి ఎంతో మంది మహిళలు తమ తమ వాహనాలతో చెక్కర్లు కొడుతూ తిరిగి తమ జీవన ఉపాదిని మెరుగు చేసే చర్యలు చేపడుతున్నారు.. ఎట్టకేలకి డ్రైవింగ్‌ హక్కుకోసం మహిళా లోకం చేసిన పోరాటం ఫలించింది. ఆదివారం ఉదయం నుంచి అనుమతించారు. వందల సంఖ్యలో మహిళలు కార్లను డ్రైవ్‌ చేసుకుంటూ సౌదీలోని ప్రధాన నగరాలైన రియాధ్‌, జెద్ధా మరియు దమ్మాంలలో రోడ్లపై వచ్చారు.

 Image result for saudi revolution women car driving

గత ఏడాది యువరాజుగా మొహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత పలు సంస్కరణలను అమలు చేశారు. తమ దేశంలో మహిళలకు డ్రైవింగ్‌ చేసే ఆవకాశం లేకపోవడంతో భారత్‌ వంటి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విదేశీయులు వచ్చి డ్రైవర్లుగా పని చేస్తున్నారని, వారికి వేతనాలు చెల్లించడం ద్వారా సౌదీ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందికి గురవుతున్నాయని యువరాజు మొహమ్మద్‌ భావించి మహిళల డ్రైవింగ్‌ను అనుమతించారు...ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల నుంచీ వచ్చిన లక్షల మంది డ్రైవర్స్ తమ ఉపాడిని కోల్పోయి మరలా తమ స్వస్థలానికి వెళ్ళే పరిస్థితి ఎదురయ్యిందనేది పరిశీలకుల అంచనా.


మరింత సమాచారం తెలుసుకోండి: