ప్రవాస భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది ఎంతో కసిగా తమ భారత సంతతి వ్యక్తులని అమెరికా అధ్యక్ష ఫీటం ఎక్కించాలని ఎన్నాళ్ళనుంచో తహతహలాడుతున్న భారతీయుల కల ఇన్నాళ్ళకి నెరవేరనుంది.. 2020 అమెరికా అధ్యక్ష  ఎన్నికల్లో..ఈ కోరిక తీరే అవకాశం ఉందని అంటున్నారు..భారతీయులు అనే వారందరికీ ఎంతో ఆసక్తిరేపుతున్న ఏకైక వార్త ఇదే..అగ్రరాజ్యం అయిన అమెరికాలో అధ్యక్ష పదవికి భారతీయ సంతతి మహిళ పోటీ పడుతుంటే ఎంతో గొప్ప విషయం అనే చెప్పాలి..వివరాలలోకి వెళ్తే..

 Image result for kamala harris

 భారత సంతతికి చెందిన అమెరికా సెనేటర్‌ కమలా హారిష్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది..ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి గాను వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పీ చెప్పక ఆసక్తిని రేకెత్తించారు.. 53 ఏళ్ల కమల..అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి. ఆమె డెమొక్రటిక్‌ పార్టీ నాయకురాలు.. ట్రంప్‌ విధానాల వల్ల నష్టపోతున్న వలసదారులకు ఆమె మద్దతు తెలుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారి ఓట్లు ఆమెకు అదనపు బలం కావచ్చనే అంచనాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

 Related image

వలసవాదులకు సంబంధించి ట్రంప్‌ ప్రభుత్వం తలపెట్టిన మార్పులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆమె గత ఏడాది తన పార్టీ నేతలను కోరారు...అమెరికా అధ్యక్ష ఫీటాన్ని అలంకరించాలి అనే గట్టి సంకల్పం ఆమెకి బలంగా ఉందని అంటున్నారు..నిజంగా ఆమె పోటీ చేసి ఎన్నికల్లో నిలబడితే మాత్రం తప్పకుండా భారత సంతతి ఎన్నారైలు..వలస జీవులు ఇలా ఎంతో మంది ఆమెకి మద్దతుగా నిలువనున్నారని ఒక సర్వే లోకూడా చెప్పడం ఎంతో ఆసక్తి రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: