సొంత ఊరు..సొంత రాష్ట్రం అంతెందుకు సొంత దేశం విడిచి ఉద్యోగరీత్యానో లేక చదువుకునే ఉద్దేస్యంతోనో ఇలా కొన్ని కొన్ని కారణాల వలన..విదేశాలకి వెళ్ళాల్సి ఉంటుంది అయితే అక్కడ అనేక కారణాల వలన ప్రవాసీయులు చనిపోవడమో లేక మరేదైనా కారణాల వలన ప్రమాదాల వలన అంగవైకల్యం వచ్చి కానీ ఉండే తెలుగు ప్రవాసీయులకి ప్రవాస పధకం ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు అధికారులు..అయితే ఈ పధకం విషయంలో స్పందన కోరవైందని తెలుస్తోందని అధికారులు తెలుపుతున్నారు..ఈ పథకం గురించి ఎన్ఆర్‌ఐ కుటుంబాలకు సరైన అవగాహన లేకపోవడంతో పాటు పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు.

  Image result for ap nri health scheme

ఈ పధకంలో ఉద్యోగులు..విద్యార్థులకు వేర్వరుగా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది అంతేకాదు నామమాత్రపు ప్రీమియంతోనే ప్రవాసాంధ్రులు ఈ స్కీం కింద ధరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది..ఉద్యోగుల వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇన్సూరెన్స ప్రీమియం ఒక్కో సభ్యుడికి రూ. 150  చెల్లించాలి.అయితే ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్‌ చేయించుకోవాలి. ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 10 లక్షల  బీమా చెల్లిస్తారు.. 

 Related image

బీమా చేయించుకొన్న వ్యక్తి అనారోగ్యం పాలైనా లేక ప్రమాదంలో గాయపడినా ఆ వ్యక్తికి, ఒక సహాయకుడికి ఎకానమీ క్లాస్‌ విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. గర్భిణులకు రూ. 35 వేలు సాధారణ కాన్పు, సిజేరియన్‌కు అయితే రూ.50 వేలు చెల్లిస్తారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి రూ. 50 వేలు వైద్య ఖర్చులకు చెల్లిస్తారు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి లిటిగేషన ఉన్నా రూ. 45 వేలు సహాయనిధి చెల్లిస్తారు.అలాగే విద్యార్థి వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉండాలి. బీమా కాలం ఏడాదిగా నిర్ణయించారు. ఈ సంవత్సరానికి రూ. 75  ప్రీమియంగా   చెల్లించాలి. విద్యార్థి ప్రమాదవశాత్తు చనిపోయినా/శాశ్వత అంగ వైకల్యం ఏర్పడినా రూ. 10  లక్షలు   చెల్లిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: