చికాగోలో భారత సంతతి వ్యక్తికి  అరుదైన గుర్తింపు కలిగింది..ఎంతో ప్రతిభ ఉంటేనే గాని ప్రతిష్టాత్మక ‘ఐన్‌స్టీన్‌ ప్రైజ్‌’ కి ఎంపిక కారు అలాంటిది ఒక భారత సంతతి వ్యక్తికి.. ఐన్‌స్టీన్‌ ప్రైజ్‌ రావడం ఎంతో సంతోషంగా ఉందని పరువురు భారత సంతతి వ్యక్తులు సంతోషం వ్యక్తం చేశారు..ఈ గుర్తింపుని భౌతికశాస్త్రంలో అత్యున్నత సేవలందించిన వారికి ప్రోత్సాహకంగా అమెరికన్‌ ఫిజికల్‌ సొసైటీ (ఏపీఎస్‌) ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తుంది.

 Image result for abhay ashtekar

ఇంతకీ ఈ “ఐన్‌స్టీన్‌ ప్రైజ్‌” మనీ కి ఎంపిక అయిన వ్యక్తి పేరు ప్రొఫెసర్‌ అభయ్‌ అష్టేకర్‌..ఆయనకీ అక్టోబర్‌ 23న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు..అంతేకాదు ఐన్‌స్టీన్‌ ప్రైజ్‌–2018తోపాటు పదివేల డాలర్లను నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంటారు...ఈయన ప్రస్తుతం ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తుండడంతోపాటు పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీలో ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్రావిటేషన్‌ అండ్‌ ది కాస్మోస్‌కి డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

 Related image

అభయ్ మాట్లాడుతూ ఈ గొప్ప అవార్డ్ గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే.. ఏపీఎస్‌ అందించే పురస్కారాల్లో ఇదే అత్యంత గౌరవమైంది. భారత్‌లో విద్యనభ్యసిస్తున్నప్పటి నుంచి నాకు భౌతికశాస్త్రంపై ఎంతో ఆసక్తి ఉండేది. మొదట్లో నాకు కేవలం ఒక మరాఠీ మాత్రమే తెలిసేది. పదకొండో తరగతి వరకు మరాఠీ మీడియంలో చదువుకున్నాను. హిందీ, ఇంగ్లిష్‌ భాషలపై పట్టుసాధించిన తర్వాత సంస్కృతిపై భాష ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాను...అంటూ ఆయన తన గతాన్ని భారత్ తో ఉన్న అనుభందాన్ని నెమరు వేసుకున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: