భారత్ ని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న ట్రంప్ అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతో భారత్ ని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నాడు..ఇప్పటికే వీసా విధానాలతో విసుగు చెందిన భారతీయులు ఇక అమెరికా కలని దాదాపు వదులుకోవలసిన పరిస్థితికి తీసుకువచ్చాడు.అయితే వలసల విధానంలో సైతం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలని అమెరికా ప్రజలే సహించడంలేదు..ఇక తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం..భారత్ పై తీవ్రమైన ప్రభావం చూపనుందని తెలుస్తోంది.

 

అమెరికా దిగుమతి చేసుకునే దాదాపు  90 వస్తువులపై సుంకం రాయితీలను ఎత్తివేసింది. ఈ 90 వస్తువులలో  50 వస్తువులు భారత్‌ నుంచి దిగుమతి చేసుకునేవే కావడం గమనార్హం. జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ కింద అమెరికా కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల్లో పూర్తి రాయితీ కల్పిస్తుంది. అమెరికా జీఎస్‌పీ వల్ల ఎక్కువగా లాభపడుతున్న దేశాల్లో భారత్‌ ప్రథమ స్థానంలో ఉంది...అయితే తాజా నిర్ణయం భారత్‌లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై అధిక ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: