అమెరికాలో నకిలీ వీసాల కారణంగా అరెస్ట్ అయిన భారత విద్యార్ధులు తల్లి తండ్రుల ఆవేదన చెప్పలేనిది. వారి పిల్లలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అంటూ ఇక్కడ ఇండియాలో వారి వారి కుటుంభ సభ్యులు తల్లడిల్లుతున్నారు. అయితే విద్యార్ధులకి నకిలీ వీసాలు అప్పగించి ఉద్యోగం , అక్కడ నివసించేలా వీలు కల్పించిన 8 మంది దళారులని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు.

 Image result for indian student arrest in us

అంతేకాదు ఇప్పటి వరకూ నకిలీ వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన దాదాపు 130 మంది విదేశీయులని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిలో సుమారు 129 మంది భారతీయులు కావడం విశేషం. అయితే అమెరికాలో భారత ఎంబసీ అరెస్ట్ అయిన విద్యార్ధులకు సాయం చేసేందుకు గాను ఇండియన్ ఎంబసీ  24 గంటల పాటు హెల్ప్ లైన్ అందుబాటులో ఉంచింది. విద్యార్థులు,వారి కుటుంభ సభ్యులకి అందుబాటులో ఉండేలా ఓ అధికారిని సైతం అందుబాటులో ఉంచారు.

Image result for indian student arrest in us

ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన రెండు హెల్ప్ లైన్ లు 202-322-1190, 202-340-2590  అంతేకాకుండా ఈ మెయిల్ ద్వారా కూడా అరెస్ట్ అయిన వారి వివరాలని అందుబాటులో ఉంచవచ్చునని తెలిపారు...ఈమెయిల్ -  cons3.washington@mea.gov.in 


మరింత సమాచారం తెలుసుకోండి: