వచ్చే లోక్ సభ ఎన్నికల నుంచీ భారతీయ ఎన్నారైలు ఓట్లని ఆన్లైన్లో వేసుకోవచ్చు అంటూ వచ్చిన వార్తలని భారత ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఆన్లైన్ లో ఓటింగ్ విధానం లేదని. సోషల్ మాధ్యమాలలో వస్తున్నా వార్తలని గుడ్డిగా నమ్మవద్దని ఓ ప్రకటనలో తెలిపింది. చాలా మందికి సోషల్ మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం అందుతోందని. ఓటు వేయడానికి ఎటువంటి వెబ్సైటు లేదని తెలిపింది.

 Image result for nri votes

అయితే ప్రవాస భారతీయులు ఆన్లైన్ లో 6ఏ ఫామ్ నింపి ఓటరుగా నమోదు నమోదు చేసుకునే అవకాశం ఉందని కాని ఓటు వేయడానికి మాత్రం తాము నిర్ణయించుకున్న పోలింగ్ బూత్ కి రావాల్సిందే అంటూ చెప్పింది. ఓటు వేయడానికి వచ్చే వారు పాస్ పోర్ట్ చూపించి ఓటు వేయవచ్చని తెలిపింది.

 Image result for election commission of india

ఆన్‌లైన్లో ఓటు వేయవచ్చు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకి ఫిర్యాదు చేసినట్లుగా ఈసీ తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయకుండా ఎన్నారైలకు ఆన్‌లైన్లో ఓటు వేసే అవకాశం కల్పించలేమని ఇది ఇప్పటిలో జరగదని ఈ విషయాన్ని ఎన్నారైలు గమనించాలని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: