అత్యంత ప్రతిష్టాత్మక ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్ కి విజయవాడకి చెందిన తరుణ్ చెరుకూరి ఎన్నికయ్యారు. తరుణ్ ఎన్నికవ్వడం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలనుంచీ  20 మంది ఈ ఫెలోషిప్ కి ఎంపిక అవ్వగా ఆ 20 మందిలో తరుణ్ చెరుకూరి ఒకరు.

 à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ యువకుడికి ఒబామా ఫెలోషిప్

ఇదిలాఉంటే భారతదేశం నుంచీ ఎన్నికైన ఏకైక వ్యక్తి, అందులోనూ తెలుగు వాడిగా రికార్డ్ క్రియేట్ చేశారు తరుణ్.అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తరుణ్ కి  ఫెలోషిప్‌ను అందజేయనున్నారు. తరుణ్ స్వచ్చంద సేవకుడిగా ఎంతో మందికి పరిచయం అయిన వ్యక్తే..

 Related image

ఢిల్లీ కేంద్రంగా ఇండస్‌ యాక్షన్‌ పేరిట ఓ స్వచ్చంధ సంస్థని ఏర్పాటు చేసి, RTI  అమలుకు ఎనలేని కృషి చేసిన వ్యక్తిగా తరుణ్ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపారు. ఇప్పటి వరకు 90 వేల మంది పేద విద్యార్థులను RTI   పరిధిలో తీసుకువచ్చి స్కూల్స్ లో చేర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: