స్థానికుల‌కే ఉద్యోగ అవ‌కాశాలు నినాదంతో అధికారంలోకి వ‌చ్చి...అనంత‌రం అలాంటి విధానాల‌కే ప్రోత్సాహం ఇస్తోన్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న మాట‌ను నిల‌బెట్టుకుంటున్నార‌ని గ‌ణాంకాలు వెలువ‌డుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాల కల్పనలో దూసుకెళ్తోంది. 1969 డిసెంబర్ అంటే 50 ఏళ్ల తర్వాత అమెరికాలో నిరుద్యోగిత రేటు కనిష్ట స్థాయికి పడిపోయింది.  నిరుద్యోగిత రేటు 3.6 శాతానికి చేరింది.


అమెరికా ఆర్థిక వ్యవస్థ 70,000 పైచిలుకుగా ఉద్యోగాల క‌ల్ప‌న‌ ఉండొచ్చనే బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిక్స్ విడుదల చేసిన నెలవారీ నివేదిక అంచనాలను తలకిందులు చేస్తూ ఏప్రిల్ నెలలో 2,63,000 ఉద్యోగాలు సృష్టించింది.  ఎక్కువ శాతం ఉద్యోగాలు నైపుణ్యంతో కూడినవి, వ్యాపారపరమైన సేవలు, నిర్మాణరంగం, వైద్యసేవల రంగంలో వచ్చాయి. గత నెల నుంచి ఉత్పత్తి రంగంలో ఉద్యోగితలో పెరుగుదల లేదు. రిటైల్ రంగంలో సుమారు 12,000 ఉద్యోగాలు పోయాయి. అయిన‌ప్ప‌టికీ, అమెరికాలో నిరుద్యోగిత 50 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 


యాహూ ఫైనాన్స్ ప్రకారం నిపుణులు ఈ నెలలో సుమారుగా 1,90,000 కొత్త ఉద్యోగాలు ఉండొచ్చని అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే వేతనాలు 3.2 శాతం పెరిగాయి. గంటలవారీ ఆదాయం కూడా 0.2 శాతం పెరిగింది. అయితే ఫెడరల్ రిజర్వ్ జోక్యం చేసుకొని వడ్డీరేట్లు పెంచకపోవచ్చని నిపుణులు అంటున్నారు. 3.8 శాతంగా ఉండొచ్చన్న అంచనాల కంటే పూర్తి 0.2 శాతం పాయింట్లు తక్కువ. చివరిసారిగా దేశంలో నిరుద్యోగిత ఇంత తక్కువ స్థాయిలో ఉండటం అమెరికన్లు మొదటిసారి చంద్రుడిపై కాలు పెట్ట‌డానికి కొన్ని నెలల ముందు జరిగింది. అప్పుడు అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మొదటిసారి అధ్యక్ష పదవీకాలం ముగిసే సమయంలో 3.5 శాతానికి ప‌డిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: