అమెరికాలో  ఉన్నత చదువుల కోసమో లేక తాము కలలుకన్న ఉద్యోగాల కోసమో వీసా కోసం అభ్యర్ధన పెట్టుకునే వారి కలలని ట్రంప్ సర్కార్ సాకారం కానిచ్చేలా లేదు. రోజు రోజుకి వీసా జారీ విషయంలో మరిన్ని  కఠినమైన నిభంధనలని రూపొందిస్తోంది. అంతేకాదు విదేశీయులు ఎవరూ కూడా అమెరికాలో అడుగుపెట్టేలా చేయకుండా వ్యవహరిస్తోంది. తాజాగా అమెరికా వీసా జారీ విషయంలో తీసుకున్న సరికొత్త నిభందనే అందుకునిదర్శనం..

 Related image

ఇకపై అమెరికా వీసాలు  జారీ విషయంలో ఎంతో కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. వీసా కోసం దరఖాస్తు చేసేవారు అన్ని పత్రాలతో పాటు సోషల్ మీడియా వివరాలు కూడా అధికారులకి అందించాలని పేర్కొంది. వీసాకి అప్లై చేసుకునే వారు ఏ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో చెప్పాలని తెలిపింది. దీనితో పాటు సుమారు ఐదేళ్లకి పైగా ఈ మెయిల్ ఐడీ రిపోర్ట్ లు కూడా ఇవ్వాలని తెలిపింది.

 Related image

ఒక వేళ దరఖాస్తుదారులు తప్పుడు సమాచారం ఇస్తే వారి అభ్యర్ధన తిరస్కరించడమే కాకుండా కఠినమైన చర్యలు తీసుకోనున్నట్టుగా హెచ్చరికలు జారీ చేశారు. గతంలో వీసాకి అప్లై చేసే వారికి ఉగ్రవాదులతో సంభంధాలు ఉన్నాయా లేదా అనే కోణంలో విచారణ జరిపే వారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా పరిశీలించి నిర్ధారణ చేసుకొనున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: