Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:54 am IST

Menu &Sections

Search

ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్‌పోర్టులు.. భార‌త్ ర్యాంక్ ఎంతంటే..

ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్‌పోర్టులు.. భార‌త్ ర్యాంక్ ఎంతంటే..
ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్‌పోర్టులు.. భార‌త్ ర్యాంక్ ఎంతంటే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి పాస్‌పోర్ట్ ఉపయోగిస్తాం.. ఎన్ని దేశాలు తిరిగినా పాస్‌పోర్ట్ ఒకటే ఉంటుంది.. కానీ వీసా మాత్రం దేశానికి దేశానికి మారుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసేవారి సంక్షేమం కోసం సొంతదేశాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాయి. అందులో భాగంగానే పాస్‌పోర్టును అందిస్తుంటాయి. నియంతృత్వ పోకడలు ఉన్న కొన్ని దేశాలు తప్పితే ప్రపంచంలోని చాలా వరకూ దేశాలు పాస్‌పోర్టులను అందిస్తున్నాయి. 


అయితే అన్ని దేశాల పాస్‌పోర్టులు ఒకటేనా అంటే.. కాదని కచ్చితంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ సమాజంలో తమ పౌరుల భద్రత, వారికి ప్రత్యేక గుర్తింపును కల్పించేలా కొన్ని దేశాలు పాస్‌పోర్టులను అందిస్తుంటాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, అత్యంత బలహీనమైన పాస్‌పోర్టులు కలిగిన దేశాల జాబితాలపై ఓ లుక్కేద్దాం... 


హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ 2019 నివేదిక ప్రకారం అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల జాబితాలో జపాన్, సింగాపూర్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టుతో ఎటువంటి వీసా అక్కర్లేకుండా ఏకంగా 189 దేశాలకు వెళ్లవచ్చు. ఆ తరువాతి స్థానంలో ఫిన్లాండ్, జర్మనీలతో కలిపి సౌత్ కొరియా ఉంది. ఈ దేశాల పౌరులు ఎలాంటి వీసా అక్కర్లేకుండా ప్రపంచవ్యాప్తంగా 187 దేశాలకు వెళ్లే సౌకర్యం కల్పిస్తోంది. డెన్మార్క్, ఇటలీ, లక్సెంబర్గ్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టుతో 186 దేశాలకు వీసా అక్కర్లేకుండా ప్రయాణం చేయగలిగేలా తమ దేశ పౌరులకు అవకాశం కల్పిస్తున్నాయి. 


ఫ్రాన్స్, స్పెయిన్, స్వీడన్ 185 దేశాలకు వీసా అక్కర్లేకుండా తమ పౌరులు స్వేచ్ఛగా వెళ్లగలిగే విధంగా పాస్‌పోర్టులను అందిస్తూ నాల్గో స్థానంలో ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూకే పాస్‌పోర్టులతో ఆ దేశ పౌరులు వీసా లేకుండా 183 దేశాలకు ప్రయాణించే వెసులుబాటు ఉంది. దీంతో యూఏస్, యూకే ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఈ జాబితాలో యూఏఈ గతేడాదితో పోలీస్తే ఏకంగా 20 స్థానాలు ఎగబాకి టాప్ -20లో నిలిచింది. 


14 ఏళ్ల యూఏఈ పాస్‌పోర్టు చరిత్రలో ఇదే అత్యుతమ ర్యాంక్. యూఏఈ పాస్‌పోర్టుతో మొత్తం 167 దేశాలకు వీసా అక్కర్లేకుండా ప్రయాణం చేయగలిగేలా తమ దేశ పౌరులకు పాస్‌పోర్టును అందిస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే 86వ స్థానంలో ఉంది. పొరుగు దేశాలైన శ్రీలంక 99, బంగ్లాదేశ్ 101, పాకిస్తాన్ 106 స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో ఆప్ఘ‌నిస్తాన్ ఉంది. ఈ దేశం అందిస్తున్న పాప్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 25 దేశాలు మాత్రమే వెళ్లే సౌకర్యం ఉంది.  


powerful-passport-in-the-world
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రుచిక‌ర‌మైన `కందిప‌ప్పు మునక్కాయ క‌ర్రీ`..
అతి నడక అంత మంచిది కాద‌ట‌.. ఎందుకంటే..
ఈ పువ్వులను ఉపయోగిస్తే మిల‌మిల మిరిసే అందం మీ సొంతం..
నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఇవి తెలుసుకోండి..
మందు తాగితే లావు అవుతారా.. నిజ‌మెంతా..?
టేస్టీ టేస్టీ `రొయ్యల కిచిడీ`
ఈ గింజలు తింటే.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు..
గంజే క‌దా అని తీసిప‌డేకండి.. ఎందుకంటే..
కుంకుమ పువ్వు వాడుతున్నారా.. అయితే..
చాక్లెట్స్‌కు మతిమరుపుకు లింక్ ఏంటో తెలుసా..
ఎంతో సులువుగా పండ‌గపూట `పాల తాలికలు`
సబ్జా గింజలకు.. మధుమేహానికి లింక్ ఏంటి..?
త‌ల‌కు నూనె పెట్టే ముందు.. ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి..
గుమ్మడి పండు.. ఔషధాలు మెండు..
`డ్రై ఫ్రూట్స్` అతిగా తింటే ఈ ముప్పు త‌ప్ప‌దు..
క్రిస్పీ క్రిస్పీ `ప‌నీర్ ప‌కోరా`
ఈ జ్యూస్‌తో జ్వ‌రానికి చెక్ పెట్టేయండి..
బ్రెడ్, బన్, పిజ్జా లాంటివి తింటే కాన్సర్ ఫ్రీ.. ఎలాగంటే..?
`డ్రై ఫ్రూట్స్‌`తో అందం.. ఆరోగ్యం..!
ఆముదం ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.