Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 4:24 pm IST

Menu &Sections

Search

అమెరికాలో తెలుగు కోసం.. "ఒక రోజు"...!

అమెరికాలో తెలుగు కోసం.. "ఒక రోజు"...!
అమెరికాలో తెలుగు కోసం.. "ఒక రోజు"...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమెరికాలో ఉంటున్న ఎంతో మంది తెలుగు ఎన్నారైలు తమ పిల్లలకి తెలుగు నేర్పించాలని ఆరాటపడుతూ ఉంటారు. తమలాగా తమ పిల్లలు కూడా తెలుగులో మాట్లాడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ పాశ్చాత్య సంస్కృతిలో అది సాధ్యమా అంటూ ఎంతో ఆందోళన కూడా చెందే వారు.కానీ ఎప్పుడైతే పాఠశాల అమెరికాలో ఏర్పడిందో అప్పటి నుంచీ వారికి ఆ భయం పోయింది. అమెరికాలో తెలుగు బాష అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి అక్కడి తెలుగు ఎన్నారైల పిల్లలకి సులభంగా తెలుగు నేర్పించడానికి ఏర్పాటు చేయబడిన పాఠశాల ఎట్టకేలకి ఆదిశగా  అడుగులు వేస్తూ మెల్లమెల్లగా విజయం సాదిస్తూ వస్తోంది.

 

ఎన్నారైల పిల్లలకి అత్యంత సులభంగా తెలుగు బాష అర్ధం అయ్యేలా ఏపీ ప్రభుత్వంతో కలిసి సులభ రీతిలో సిలబస్ రూపొందించిన పాటశాల గత ఐదేళ్లుగా అక్కడి పిల్లలకి తెలుగు నేర్పిస్తోంది. ఇదిలాఉంటే అమెరికాలోని బే ఏరియాలో నూతనంగా 2019 -20 సంవత్సరానికి గాను పాఠశాల శాఖని ఏర్పాటు చేసింది. అంతేకాదు తాజాగా తెలుగు బాషా దినోత్సవం పురస్కరించుకుని వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.

 

వారంలో ఒక రోజుని తెలుగు డే గా ప్రకటించాలని భావించింది. వారంలో ఒక రోజు పూర్తిగా తెలుగు మాట్లాడేలా తల్లి తండ్రులు పిల్లలల్ని ప్రోత్సహించాలని తెలిపింది. అందుకుగాను గురువారం రోజుని తెలుగు రోజుగా పాఠశాల ప్రకటించింది. ఆ రోజు పెద్దలు సైతం పిల్లలతో తెలుగులోనే మాట్లాడితే పిల్లలకి ఎంతో సులభంగా తెలుగు వస్తుందని తెలిపింది.ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది.  

 

 


paatasala-in-us-telugu-day
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బరువు తగ్గి ముఖం కోమలంగా అవ్వాలంటే...అలోవెరా...
హెచ్ 1 బీ వీసా జారీలో భారీ మార్పు...కొత్తగా మరో రూల్...!!!
10వ తరగతి అర్హతతో...సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు..చివరితేదీ..
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
Redmi నోట్ 7 ప్రో పై భారీ తగ్గింపు..!!!!
పాకిస్థాన్ కి అమెరికా సెనేటర్ హెచ్చరిక...!!!
సహజసిద్ద ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలంటే...!!!
ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు...!!!
ట్రంప్ ఆదేశాలతో...ఇండో అమెరికన్ కి కీలక పదవి..!!!