ఈనాడు మనం ఊహించని కొత్త శత్రువు దేశ సరిహద్దుల బయటినుండి రావడంలేదు frown emoticon  భారతదేశం సహనానికి మారుపేరు. భారతదేశం తనంత  తానుగా ఏదేశం మీదికి దండయాత్ర చేయని దేశం. అలాగే తన సర్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎట్టిపరిస్థితులలోనూ రాజీ పడని దేశం. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు ఏకత్వంలో భిన్నత్వం ఉన్న వింత స్థితి మనకుమాత్రమే ప్రత్యేకం. కొన్ని వందల సంవత్సరాలుగా పరాయి దేశాలు దాడులు జరిగినా వాటిని తట్టుకుని మన సంస్కృతిమీద ప్రభావంపడకుండా చూసుకున్న మన భారతదేశం ఈనాడు వింతగా మనదేశంలోని శతృవుని చూసి అలజడి చేందాల్సిన వింత పరిస్థితి ఎదుర్కొంటోంది. గాంధీగారి శాంతి మంత్రానికి కట్టుబడి ఎన్నిసార్లు స్నేహ హస్తమందించి చేయికాల్చుకున్న అనుభవం మనది.


మన సహనానికి హద్దులులేవు. అన్ని సంస్కృతులనీ గౌరవిస్తాం. మన సంస్కృతిని అవమానపరచినవాడిని ఇంకొంచం ఎక్కువ గౌరవిస్తాం. స్వంతతల్లి తనపిల్లలకి పెట్టకుండా "ఎవరేమనుకుంటారో" అని పక్కపిల్లలకి పెట్టినట్టు, మన సంస్కృతిని త్యాగంచేసి మరీ అవతలివాడి సంస్కృతిని ఆదరిస్తాం. అవతలివాడి దేవుడిమీద వ్యాఖ్యానించడానికి కూడా భయపడతాం, కానీ మన దేవుడిమీద జోకులేసినా నవ్వేస్తాం. ప్రశ్నించినవాడికి తీవ్రవాద ముద్ర వేసేసి తృప్తి పడతాం. తీవ్రవాదిని మగఢీరుడిగా పొగిడినా సహిస్తాం.


 ఐతే నిజంగా సహనమా? చేతగానితనానికి "సహనం" అనే ముసుగువేసుకొని మనకి మనం చేసుకుంటున్న ఆత్మవంచనా?


జపాన్లో జరిగిన ఒక చిన్న సంఘటనను చూద్దాం. అక్కడకూడా దైవభక్తి ఎక్కువ (మనలాగే). ప్రత్యేకించి శాంతికి మారుపేరైన బుద్దుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. అక్కడ ఒక స్కూలులో మీకు భోజనమెలావస్తుంది? మీకు అన్ని సౌకర్యాలన్నీ ఎవరు కల్పిస్తున్నారు? వంటి ప్రశ్నలకు వారు "దేవుడు" అనే సమాధానం చెప్పారట. ఎవరైనా మీదేశం మీద దండయాత్ర చేస్తే ఏం చేస్తారు? అంటే ఎదిరిస్తాం అన్నారట. మరి ఒకవేళ దండయాత్ర చేయడానికి వచ్చింది దేవుడే ఐతే? అన్న ప్రశ్నకు వారి సమాధానం "దేవుడైనాసరే ఎదిరిస్తాం" అని. ఇది వారి దేశభక్తికి ఒక ఉదాహరణ. అన్నీ ఇచ్చిన దేవుడైనా తమదేశం మీద దండయాత్ర చేస్తే సహించేది లేదని చెప్పిన చిన్నపిల్లలు ఉన్నటువంటి జపాన్ నిజంగా ఎంతో అదృష్టవంతమైనది.


కానీ సహనానికి మారుపేరైన మనదేశంలో పరిస్థితులు చాలా వింతగా ఉన్నాయి. మనం ఖండంతరాళనుండి విశ్వాంతరాళాలకు ఎదుగుతున్నా, మనతోపాటే ఏర్పాటైన మన సోదరదేశం ఇంకా మనదేశంలోకి చొరబడలనే ప్రయత్నంలోనే తన పూర్తి శాయశక్తులని వెచ్చిస్తోంది. ఇదోక్కటే ధ్యేయంగా తన ప్రజలని మత్తులో ఉంచుతూ రెచ్చగొడుతోంది. ప్రత్యక్షంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఏనాడూ సఫలీకృతంకాలేకపోయింది. ఇక దానికి మిగిలింది బ్రిటీషు వాడు పోతూ పోతూ వదిలిపెట్టిన మతచిచ్చు మాత్రమే. ఎదురుగా పోటీపడలేమని తెలిసి, దొంగదెబ్బతీసే ఎటువంటి అవకాశాన్నీ వదులుకోకూడదన్న ఏకైక లక్ష్యంతో తన అభివృద్దిని తాకట్టుపెట్టి మరీ మన దేశాన్ని దెబ్బతీసే ప్రతిచిన్న అవకాశాన్నీ వదులుకోకూడని కాచుకొని కూర్చుంది మన సోదరదేశం.


ఒకదేశం అభివృద్ది చెందడంకోసం తన మానవ వనరులని రకరకాలుగా వాడుకుంటుంది. వాటిని రక్షించుకోవడం కోసం రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటుంది. మానవవనరుల అభివృద్దిలో ముఖ్యపాత్ర పోషించేది "విద్య". వారి వారి తెలివితేటల స్థాయిని బట్టి వారికి విద్యనందించేందుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇది ఖర్చుగా కాక దేశభవిష్యత్తుకు ఉజ్వల భవిష్యత్తు నందిచే మేధావులను తయారుచేసేందుకు పెట్టుబడిగా భావించడం జరుగుతుంది. ఇక రెండవది రక్షణ. తన సార్వభౌమత్వమాన్ని కాపాడుకోవడంకోసం ఏదేశమైనా మొదటి ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ దేశానికైనా సుస్థిరత, శాంతి అనేవి అభివృద్దికి మూలాలు. ఎప్పుడూ యుద్దాలలో మునిగితేలే దేశాం ఎంత ధనవంతమైనదైనా అక్కడి ప్రజలు సుఖంగా ఉండలేరు.


ప్రస్థుతం మన దేశంలో విద్యమీద కొన్ని వందల వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతోంది. కొన్ని లక్షల రూపాయలు విలువచేసే కోర్సులు ప్రతిభకల విద్యార్థులకు దాదాపుగా ఉచితంగా అందచేయబడుతున్నాయి. అలాగే సైనిక వ్యవస్థ- మన రాబడిలో అత్యధిక శాతం మనం ఖర్చు చేస్తున్న రంగం.పైన చెప్పిన రెండు రంగాలలోనూ దేశానికి పనికివచ్చే ఒక విద్యార్థిని కానీ, ఒక సైనికుడినికానీ తయారుచేయడానికి మనం కడుతున్న పన్నులో అత్యధిక శాతం వెచ్చింపబడుతోంది. పైగా ఒక మేధావి లేదా సైనికుడు తయారవడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది.
ఒక సామాన్యుడు మేధావిగా మారడానికి కొన్నివందల పరీక్షలు వ్రాసి, కొన్నివందలమందితో పోటీపడి తన సామ్ర్థ్యాన్ని నిరూపించుకుంటూ ఒకో అర్హతా సంపాదించుకుంటూ దేశసేవకు సన్నద్దమవుతుంటే, మరోపక్క ఒక ఆరోగ్యవంతుడు కొన్ని సంవత్సరాల కఠోర శారీరిక శ్రమకోర్చి, కొన్ని లక్షల/కోట్ల విలువ చేసే ఆయుధాలను ఉపయోగించే శిక్షణతో, తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడడానికి సిద్దమై బయటికి వస్తున్నారు.


ఇలా తయరయిన సైనికుడు తన భవిష్యత్తుని, తనమీద ఆధారపడ్డవారి భవితవ్యాన్ని దేశం చేతిలో పెట్టి కర్తవ్య నిర్వహణకోసం సరిహద్దుల్లో ఒక్కోసారి 50 డిగ్రీల ఎడారిలో, మరోసారి -50 డిగ్రీల మంచుకొండలలో, నెలలకొద్దీ సముద్ర అలలపై మన రేపటికోసం వారి నేటిని త్యాగం చేస్తూ గడుపుతున్నారు. ఎంతో దుర్భలమైన పరిస్థులలో దేశ రక్షణకోసం శ్రమిస్తున్నారు. ఇదంతా బయటినుండి నుండి శత్రువు మన భూభాగంలోకి చొరబడకుండా చేస్తున్న శ్రమ.


కానీ ఈనాడు మనం ఊహించని కొత్త శత్రువు దేశ సరిహద్దుల బయటినుండి రావడంలేదు. మనం ఎంతో ఖర్చు చేస్తూ మేధావులను తయారుచేయాలనుకున్న విద్యావ్యవస్థ నుండే, మనం చెపుతున్న పాఠాలతోనే, మనమిచ్చిన స్వాతంత్ర్యంతోనే తయారవుతున్నారు. అన్ని సౌకర్యాలని ఇచ్చిన దేశంకన్నా పరాయిదేశమంటే వీరికి మక్కువ ఎక్కువ. త్యాగానికి మారుపేరుగా సరిహద్దులో మగ్గుతూ దేశాన్ని కాపాడుతున్న మన సైనికుడికన్నా మనదేశాన్ని నాశనం చేద్దామనుకున్న శత్రువు వీరికి ఆరాధ్యుడు. దేశంలోని సామాన్య పౌరుడి ఆర్థిక స్వావలంబనకన్నా వీరికి శత్రుదేశంనుండివచ్చిన నరహంతకుడి స్వాతంత్ర్యం మిన్న. తమకడుపు మాడ్చుకుని వీరి చదువుకోసం ఆకలితో అలమటిస్తున్న దేశ పౌరుడి ఆకలికన్నా శత్రుదేశపు నరభక్షకుడి క్షేమం ముఖ్యం. మన తిండి తింటూ శత్రుదేశానికి "జై" కొట్టే స్వాతంత్ర్యం మీరు ఏ దేశంలోనైనా చూసారా? అది ఒక్క మనదగ్గరే సాధ్యం. మరే దేశమైనా ఈపాటికి వాడి తలలో వంద బుల్లెట్లు దించి ఆ ఆలోచన వచ్చిన ప్రతీ నరాన్ని చిధ్రం చేసేది.


కానీ మనమింకా మీనమేషాలు లెక్కపెడుతున్నాం. మళ్ళీ అటువంటి ఆలోచనే మరెక్కడా తలెత్తకుండా జల్లెడపట్టి మరీ ఏరిపారేసేది. కానీ మనలోనే కొందరు వీరికి మద్దతు పలుకుతారు. వారికూతమిచ్చేవారిని బ్రతిమలాడుతున్నాం. చట్టాలంటూ కోర్టులచుట్టూ మేపుతూ తిప్పుతున్నాం.దీనికంతా కారణం మితిమీరిన సహనం, హద్దులు లేని స్వాతంత్ర్యం. "అతిసర్వత్ర వర్జయేత్" అన్నట్టు, మితిమీరిన సహనం చేతగానితనంగా పరిగణింపబడుతుండగా, హద్దులులేని స్వాతంత్ర్యం దేశానికే వ్యతిరేకంగా మాట్లాడే వారిని ప్రోత్సహిస్తోంది. ఇటువంటి మేధావులు మనదేశానికి అవసరమా? ఇటువంటివారిని తయారు చేస్తున్న (అత్యంత ఖరీదయిన) మన విద్యావ్యవస్థ తయారుచేస్తోంది దేశభక్తుడినా? దేశద్రోహినా? ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్నవారిని ఎన్నుకుంటున్న మన దేశభక్తి ఏపాటిది? దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడికి ఎదురుచెప్పలేని మన సహనం ఎందుకు పనికివచ్చేది? దేశద్రోహిని ద్రోహి అని నిరూపించి శిక్షవేయడానికి సవత్సరాల సమయం తీసుకుంటున్న


మన.. విద్యావ్యవస్థ తయారుచేస్తోంది దేశభక్తుడినా? దేశద్రోహినా? ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్నవారిని ఎన్నుకుంటున్న మన దేశభక్తి ఏపాటిది? దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడికి ఎదురుచెప్పలేని మన సహనం ఎందుకు పనికివచ్చేది? దేశద్రోహిని ద్రోహి అని నిరూపించి శిక్షవేయడానికి సవత్సరాల సమయం తీసుకుంటున్న మన న్యాయవ్యవస్థ చేస్తున్న "న్యాయం" ఏమిటి?
(కుహనా) మేధావులారా ఆలోచించండి! దేశద్రోహిని "ద్రోహీ" అని నోరారా తిట్ట(కో)లేని సహనం, మనముందే మనదేశసమగ్రతను దిక్కరించేంత స్వాతంత్ర్యం మనకవసరమా? విమర్శకులకు గమనిక: ఈ విషయంలో ఇప్పటికే వాదోపవాదాలు, చర్చలూ చాలా జరిగాయి, జరుగుతున్నాయి. ఎవరెన్ని చర్చించినా, ఎవరి వాదనలేమైనా, "దేశసమగ్రతను" వేలెత్తిచూపుతూ పరాయి దేశ నరహంతకుడిని దేశభక్తుడిగా కీర్తిస్తూ, అటువంటివాడు ఇంటికొకడు పుట్టాలి అని కోరుకునే దుర్మార్గుడిని భరించేంత సహనం నాకు లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: